Feature Phones: ఫీచర్ ఫోన్స్‌లో అవే టాప్.. తక్కువ ధరలోనే అధునాతన స్పెసిఫికేషన్లు..!
భారతదేశంలో ఉన్న గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ తయారీ కంపెనీలు ఫీచర్ ఫోన్స్‌లో కూడా అధునాత ఫీచర్లు అందుబాటుకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌తో పాటు యూపీఐ చెల్లింపులు చేసే విధంగా అప్‌డేట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత్తం అన్ని అప్‌డేట్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్ ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చేసరికి ఫీచర్ ఫోన్స్‌లో అప్‌డేట్స్ తగ్గిపోయాయి. అయితే భారతదేశంలో ఉన్న గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ తయారీ కంపెనీలు ఫీచర్ ఫోన్స్‌లో కూడా అధునాత ఫీచర్లు అందుబాటుకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌తో పాటు యూపీఐ చెల్లింపులు చేసే విధంగా అప్‌డేట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత్తం అన్ని అప్‌డేట్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్ ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
జియో ప్రైమా 4జీ
జియో ప్రైమా 4 జీ ఫోన్ ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌పై ఆధారపడి పని చేసే కేఐఓఎస్‌తో పని చేస్తుంది. కాబట్టి ఈ ఫోన్‌లో యూట్యూబ్, గూగుల్ యాప్స్‌తో పాటు ఫేస్‌బుక్ కూడా వాడవచ్చు. అలాగే జియో టీవీ, సినిమా, సావన్ వంటి యాప్స్‌కు మద్దతునిస్తుంది. అలాగే యూపీఐ చెల్లింపులకు కూడా మద్దతునిస్తుంది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ధర కేవలం రూ. 1,299. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు అధికారిక జియో స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
లావా పల్స్ 1
ఆరోగ్య సంబంధిత ఫీచర్లతో వచ్చే లావా పల్స్1 అమ్మకాల్లో దూసుకుపోతుంది. హృదయ స్పందన, రక్తపోటు పర్యవేక్షణ సెన్సార్‌తో వచ్చే ఈ ఫోన్ వృద్ధులకు అనుకూలంగా ఉంటుంది. లావా పల్స్ 1 కేవలం ఆరోగ్య గాడ్జెట్ మాత్రమే కాదు. ఇది కీప్యాడ్, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. 1,800 ఎంఏహెచ బ్యాటరీతో కూడిన 2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. కేవలం రూ. 1,990కు అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
నోకియా 2660 ఫ్లిప్
నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ఇటీవల కాలంలో ఫీచర్ ఫోన్ లవర్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇది రెండు డిస్ప్లేలను కలిగి ఉంది. లోపల 2.8-అంగుళాల క్యూవీజీఏ యూనిట్, వెలుపల 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ డిస్‌ప్లేతో వస్తుంది. ఔటర్ డిస్‌ప్లే కాలర్ ఐడీ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, అయితే మీరు స్టైల్‌తో కాల్‌లను ముగించడానికి ఫోన్‌ను షట్‌గా తిప్పవచ్చు. ఈ ఫోన్ యూపీఐ 123 పే మద్దతుతో కూడా వస్తుంది. అంటే డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.
నోకియా 130 మ్యూజిక్ 2023
మంచి ఆడియో ఫీచర్‌తో వచ్చే నోకియా 130 మ్యూజిక్ 2023 ఫోన్ మినిమలిజం అభిమానులు మెచ్చుకునే సొగసైన డిజైన్‌ను కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లేతో పాటు పెద్ద 1,450 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది నోకియా క్లెయిమ్ చేసిన స్టాండ్‌బైలో 30 రోజులు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..