Server Down: గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..

|

Jul 20, 2024 | 5:25 PM

ఈ సమస్య తలెత్తడానికి క్రౌడ్‌ స్ట్రెయిక్‌ అప్‌డేట్ కారణమని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తమ ఇంజనీర్లు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ముఖ్యంగా క్లౌడ్‌ సర్వీసులతో నడిపే సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌ స్ట్రైయిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్న సిస్టమ్స్‌లో ఈ సమస్య తలెత్తింది...

Server Down: గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..
Server Down
Follow us on

మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌లలో తలెత్తిన సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన బ్యాంకింగ్, మీడియా, ఎయిర్‌లైన్స్‌, టెలి కమ్యూనికేషన్స్‌ రంగాలపై భారీగా ప్రభావం పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమానం టికెట్స్‌ను పెన్నుతో రాసి ఇచ్చిన రోజులు వచ్చాయి. విండోస్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచం స్థంబించిపోయింది.

ఈ సమస్య తలెత్తడానికి క్రౌడ్‌ స్ట్రెయిక్‌ అప్‌డేట్ కారణమని కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తమ ఇంజనీర్లు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ముఖ్యంగా క్లౌడ్‌ సర్వీసులతో నడిపే సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌ స్ట్రైయిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్న సిస్టమ్స్‌లో ఈ సమస్య తలెత్తింది. దీంతో అన్ని కంప్యూటర్స్‌లో బ్లూ స్క్రీన్ వచ్చింది. ఈ కారణంగానే సేవలు నిలిచిపోయాయి. అయితే ఇలా సర్వర్లు డౌన్‌ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు టెక్‌ రంగంలో ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* 2021 డిసెంబర్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ సర్వర్లు డౌన్‌ అయ్యాయి. ఈ సమయంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, స్పాటిఫై వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల కార్యాకలాపాలపై ప్రభావం పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.

* ఇక ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. 2021లో సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సమయంలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. సుమారు 6 గంటలపాటు ఈ అంతరాయం ఏర్పడింది.

* ఇక క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కి చెందిన ఫాస్ట్లీ జూన్ 2021లో నిలిచిపోయింది. దీని కారణంగా న్యూయార్క్ టైమ్స్‌తో సహా.. CNNతో సహా పలు గ్లోబల్‌ వార్తా సంస్థల సేవలు నిలిచిపోయాయి.

* 2017లో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ కూడా సర్వర్ డౌన్‌ సమస్యను ఎదుర్కొంది. ఈ కారణంగా ఆ సమయలో 672 విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికుల చెల్లింపులు నిలిచిపోయాయి.

* 2020లో గూగుల్‌ సర్వర్లు సైతం డౌన్‌ అయ్యాయి. కేవలం 5 నిమిషాలు మాత్రమే సర్వర్లలో సమస్యలు వచ్చాయి. ఈ సమయంలో జీమెయిల్‌, యూట్యూబ్‌, గూగుల్ క్యాలెండర్‌ వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది.

* 2021లో వెరిజోన్‌లో సర్వర్‌ డౌన్‌ అయ్యింది. ఈ ఇంటర్నెట్‌ అంతరాయం గంటసేపు మాత్రమే ఉన్నా..కస్టమర్లకు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిం

* 2021 డిసెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌లో మరో పెద్ద ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో దాని Azure సేవ 90 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ఆఫీస్‌ 365 సేవలకు సైన్‌ ఇన్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..