AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prime Day: కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలోనే సూపర్ ఫోన్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ సేల్‌ జులై 21వ తేదీ (ఆదివారం) రాత్రి 11.59 నిమిషాలతో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు గృహోపకరణాల వరకు డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు....

Prime Day: కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలోనే సూపర్ ఫోన్స్‌..
Amazon Prime Sale
Narender Vaitla
|

Updated on: Jul 20, 2024 | 4:42 PM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ సేల్‌ జులై 21వ తేదీ (ఆదివారం) రాత్రి 11.59 నిమిషాలతో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు గృహోపకరణాల వరకు డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ సేల్‌ నిర్వహిస్తున్నారు. మరి ఈ సేల్‌లో భాగంగా ఆఫర్స్‌తో కలుపుకొని రూ. 10వేల లోపు లభిస్తోన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లు ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* రూ. 10 వేల లోపు లభిస్తోన్న బెస్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ 13సీ ఒకటి. ఈ ఫోన్‌ను రూ. 9,499కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 6100+ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

* పోకో ఎమ్‌6 ప్రో 5జీ ఫోన్‌ను ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా రూ. 9,998కి సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీలు.. వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

* తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫోన్స్‌లో iQOO Z9 Lite ఒకటి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ తొలిసేల్‌ను ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్ ధర రూ. 9,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

* అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో లభిస్తోన్న మరో బెస్ట్‌ ఫోన్స్‌లో నోకియా జీ42 5జీ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 9,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఈ ఫోన్‌లో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు