స్మార్ట్ ఫోన్లు కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు.. అంతకుమించి. నిజమే కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో ప్రపంచమే మనిషి అరచేతిలో ఇమిడిపోతోంది. గ్లోబల్ వైడ్ గా ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. సమాచార మార్పిడి అంత వేగంగా జరుగుతోంది. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ అనేది అత్యద్భుత టెక్నాలజీతో కూడిన ఓ కాంప్లెక్స్ డివైజ్. దీనిలోనే మన వ్యక్తిగత సమాచారంతో పాటు పాస్ వర్డ్ లు బ్యాంక్ డిటైల్స్ అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అటువంటి స్మార్ట్ ఫోన్ భద్రత విషయంలో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి. మన ఫోన్ కనిపించకుండా పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించారని తెలిసినప్పుడు దానిని వెతకాలంటే పోలీసులైనా, టెక్ నిపుణులైనా మొదటిగా అడిగే ప్రశ్న మీ మొబైల్ ఐఎంఈఐ నంబర్ చెప్పండి అని. ప్రతి మొబైల్ కి ఈ నంబర్ ఉంటుంది. కేవలం స్మార్ట్ ఫోన్లకే కాదు జీఎస్ఎం మొబైల్స్ కి ఈ ఐఎంఈఐ నంబర్ ఉంటుంది. అసలు ఈ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు? ఎలా ఇస్తారు? దీని ప్రయోజనం ఏంటి? తెలుసుకుందాం రండి..
ఐఎంఈఐ నంబర్ అంటే.. ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటెటీ కోడ్. ఇది 15 అంకెలతో కూడి ఉంటుంది. ప్రతి మొబైల్ కి ఈ నండర్ కచ్చితంగా ఉండి ఉంటుంది. ఈ నంబర్ అలోకెట్ చేసిన తర్వాతే అది అమ్మకానికి వస్తుంది.
ఐఎంఈఐ ఉద్దేశం ఏమిటి.. సాధారణంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను వెతకడం కోసం ఈ ఐఎంఈఐ నంబర్ ను వినియోగిస్తారు. ఈ కోడ్ ద్వారా ఎవరైనా మీ ఫోన్ లో సిమ్ మార్చినా, వారు ఎక్కడ ఉన్నారు, అనే విషయాలు తెలిసిపోతాయి. ఈ నంబర్ ఆధారంగా మొబైల్ ని ట్రాక్ చేయొచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్లకు అయితే రెండు ఐఎంఈఐ నంబర్లు ఉంటాయి.
ఫోన్ పోతే ఎం చేయాలి.. ఒకవేళ మీ కనిపించడం లేదనుకోండి.. లేదా ఎవరైనా దొంగిలించారనుకోండి మొదటిగా మీరు చేయాల్సి పనేంటి అంటే దానిలోని సిమ్ లను బ్లాక్ చేయాలి. అందుకోసం టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించాలి. అప్పుడు మీ బ్లాక్ లిస్ట్ లో చేర్చి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సీఈఐఆర్(సీఈఐఆర్) అవసరమైన పనిని చేసిపెడుతుంది. ఈ సీఈఐఆర్ అనేది అన్ని మొబైల్ నంబర్ల వివరాలను మెయింటేన్ చేస్తుంది. అవసరమైతే ఆ నంబర్లను బ్లాక్ చేయడానికి దీనికి అధికారం ఉంటుంది.
మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్ తెలుసుకోవడం ఎలా.. నాలుగు రకాల విధానాలను వినియోగించి ఐఎఈఐ నంబర్ ను తెలుసుకోవచ్చు. కాల్ చేయడం ద్వారా నంబర్ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఫోన్ కొన్నప్పుుడు వచ్చిన ఫోన్ బాక్స్ పై కూడా ఈ నంబర్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ సెట్టింగ్స్ ల కూడా ఈ నంబర్ ఉంటుంది.
కాల్ చేయడం ద్వారా.. యూఎస్ఎస్డీ అంటే అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్, ఇది జీఎస్ఎం (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్) ప్రోటోకాల్. ఇది ఎస్ఎంఎస్ లాగానే ఉంటుంది. కానీ మీ ఫోన్‌కు మాత్రమే అర్థమయ్యే కోడ్‌ల రూపంలో ఉంటుంది. మీ డయల్‌ప్యాడ్‌ని తెరిచి, *#06# కోడ్‌ని టైప్ చేసి డయల్ చేస్తే ఇది మీ ఫోన్ ఐఎంఈఐ కోడ్‌ని మీ స్క్రీన్‌పై షేర్ చేస్తుంది. మీరు తాజా స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే, మీరు ఎంటర్ బటన్‌ను కూడా నొక్కాల్సిన అవసరం లేదు, బదులుగా, ఇది మీ ఐఎంఈఐ కోడ్‌ను స్వయంచాలకంగా చూపుతుంది.
మీ ఫోన్ బాక్స్‌లో.. మీరు మీ ఫోన్ కొన్నప్పుడు ఓ బాక్స్ వస్తుంది. దానిని మీరు భద్రపరచుకుంటే.. దానిపై మీ ఐఎంఈఐ నంబర్‌ను సులభంగా కనుగొనవచ్చు. ఆ బాక్స్ నాలుగు వైపులా తనిఖీ చేస్తే నంబర్ ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో చెక్.. ఆండ్రాయిడ్ వినియోగదారులు వారి ఐఎంఈఐ నంబర్‌ని తనిఖీ చేయడానికి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులో అబౌట్ ఫోన్ లేదా ఫోన్ ఆప్షన్ అవైలబుల్ అనే దానిని ఎంపిక చేసుకోడి. కిందకి వెళ్తే ఐఎంఈఐ కోడ్ మీకు కనిపిస్తుంది.
ఐఫోన్‌లో.. యాపిల్ వినియోగదారులు ఐఎంఈఐ నంబర్ ను తెలుసుకోవాలంటే మీ ఐఫోన్, ఐ క్లౌడ్, ఐ ప్యాడ్ డివైజ్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. దానిలో జనరల్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత అబౌట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దానిలో మీకు ఐఎంఈఐ కోడ్ కనిపిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..