Google Chrome: మీ అకౌంట్లపై హ్యాకర్ల గురి.. వెంటనే ఈ పని చేయకపోతే అంతే సంగతులు.. కేంద్ర సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక..

|

May 26, 2024 | 8:23 AM

కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాస్స్ టీమ్ (సీఈఆర్టీ - ఇన్) ఇటీవల క్రోమ్ యూజర్లకు ఓ సూచన చేసింది. తమ పీసీలలోని క్రోమ్ బ్రౌజర్ ను తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించింది. లేకపోతే హ్యాకర్లు పీసీలను నియంత్రణ చేసి, విలువైన సమాచారం దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.

Google Chrome: మీ అకౌంట్లపై హ్యాకర్ల గురి.. వెంటనే ఈ పని చేయకపోతే అంతే సంగతులు.. కేంద్ర సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక..
Google Chrome
Follow us on

ఈ రోజుల్లో మనం ఏ పని చేయాలన్నా కంప్లూటర్లే ఆధారం. వాటి అవసరం లేకుండా ఒక్క క్షణం గడవదు. ఒక పనిని మనిషి కన్నా వంద రెట్ల వేగంగా ఇవి నిర్వర్తిస్తాయి. కంప్యూటర్ లేకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది. మనం కంప్యూటర్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగించి వివిధ పనులు చేసుకుంటాం. మన ఆర్థిక లావాదేవీలను కూడా దీనిలో నిర్వహిస్తాం. అందుకోసం పాస్ వర్డ్, ఇతర పిన్ నంబర్ల కూడా ఎంటర్ చేస్తాం. వీటి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ తమ వ్యక్తిగత కంప్యూటర్లలో (పీసీలు) గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఈ బ్రౌజర్ లో కొన్ని లోపాల కారణంగా హ్యకర్లు హ్యక్ చేసే అవకాశం ఉందని తెలిపింది.

సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక..

కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాస్స్ టీమ్ (సీఈఆర్టీ – ఇన్) ఇటీవల క్రోమ్ యూజర్లకు ఓ సూచన చేసింది. తమ పీసీలలోని క్రోమ్ బ్రౌజర్ ను తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించింది. లేకపోతే హ్యాకర్లు పీసీలను నియంత్రణ చేసి, విలువైన సమాచారం దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.

హ్యాక్ చేసే అవకాశం..

గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ వెర్షన్ లో కొన్ని లోపాలను సీఈఆర్టీ – ఇన్ సిబ్బంది గుర్తించారు. హ్యాకర్ వాటిని ఉపయోగించుకుని సిస్టమ్ ను నియంత్రణ చేసే అవకాశం ఉంది. ముందుగా హ్యాకర్ తాను దాడి చేయాలనుకున్న వ్యక్తిని ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ ను చూసేలా ఒప్పిస్తాడు. అతడు అనుకున్నది జరిగితే వెంటనే పీసీని హ్యాక్ చేస్తాడు. విండోస్ మరియు మ్యాక్స్ కోసం 125.0.6422.76/.77కి ముందు, లినక్స్ కు సంబంధించి 125.0.6422.76 కంటే ముందు వెర్షన్లకు అప్ డేట్ తప్పనిసరి.

అప్ డేట్ చేసుకునే విధానం..

  • సీఈఆర్టీ – ఇన్ ఆదేశాల మేరకు పీసీలలోని గూగుల్ క్రోెమ్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలి. మ్యాక్, విండోస్ తో సహా సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
  • ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను తెరవండి.
  • కుడి ఎగువ మూలలో మూడు చుక్కల మెనూను గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
  • మెనూలోని “హెల్ప్” విభాగానికి వెళ్లండి.
  • సబ్ మెనూ ఆప్షన్లలోని అబౌట్ గూగుల్ క్రోమ్ అనేది దానిని ఎంపిక చేయండి.
  • క్రోమ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌లను తనిఖీ చేస్తుంది. అవి అందుబాటులో ఉంటే, వెంటనే డౌన్ లోడ్ అయ్యి, ఇన్ స్టాల్ అవుతాయి.
  • అప్‌డేట్ పూర్తయిన తర్వాత, తాజా వెర్షన్‌తో క్రోమ్ ను రీస్టార్ట్ చేయడానికి “రీలాంచ్” బటన్‌ను క్లిక్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..