Unlimited 5G: వాడుకున్నోడికి వాడుకున్నంత! ఈ ప్లాన్లతో రీచార్జ్ చేస్తే అపరిమిత 5జీ డేటా..

ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కంపెనీలు తమ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా ప్లాన్‌లను అందజేస్తున్నాయి. ఇవి 5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. రూ. 239తో ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా ఉంది. మిగిలిన ప్లాన్లు కూడా కేవలం రూ.500 లోపే అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Unlimited 5G: వాడుకున్నోడికి వాడుకున్నంత! ఈ ప్లాన్లతో రీచార్జ్ చేస్తే అపరిమిత 5జీ డేటా..
Recharge Plan
Follow us

|

Updated on: Mar 28, 2024 | 7:24 AM

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. అనేక రకాల ఫీచర్లతో పలు కంపెనీల ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్ వర్క్ కంపెనీలు కూడా తమ సేవలను మరింత మెరుగు పరిచాయి. వినియోగదారులకు అవసరమైన డేటాను అందజేస్తున్నాయి. ప్రజల అవసరాలకు తగిన విధంగా అనేక ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలైంది. రోజూ క్రెకెట్ మ్యాచ్ లు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది యువత స్మార్ట్ ఫోన్లలో మ్యాచ్ లను వీక్షిస్తారు. దీంతో డేటా వినియోగం బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో డేటా కోసం వినియోగదారులు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. అయితే టెలికామ్ కంపెనీలు అదిరే ఆఫర్ ను ప్రకటించాయి. అదేంటంటే మీ వద్ద 5జీ నెట్ వర్క్ ఉంటే అపరమిత 5జీ డేటా ను అందిస్తున్నాయి. అన్ని టాప్ నెట్ వర్క్ లలోనూ ఈ ఆఫర్ ఉంది. ఆ నెట్ వర్క్ లు ఏంటి? రీచార్జ్ ప్లాన్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అపరిమిత 5జీ డేటా..

ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కంపెనీలు తమ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా ప్లాన్‌లను అందజేస్తున్నాయి. ఇవి 5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ రెండు నెట్ వర్క్ లకు సంబంధించిన 5జీ సేవలు ఉన్న ప్రాంతాల్లో లభిస్తాయి. వీటిని 2022 అక్టోబర్ లోనే ప్రకటించాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో రెండు కంపెనీలూ తమ 5జీ నెట్‌వర్క్‌లను చురుకుగా విస్తరిస్తున్నాయి. రూ. 239తో ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా సదుపాయం కూడా ఉంది. మిగిలిన ప్లాన్లు కూడా కేవలం రూ.500 లోపే అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 239.. ఈ ప్లాన్ లో అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, 200 జీబీ డేటా రోల్‌ఓవర్, రోజూ 1 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు. ఈ ప్లాన్ 24 రోజుల వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రిలయన్స్ జియో రూ. 239.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు.

ఎయిర్ టెల్ రూ.265.. ఈ ప్రీ పెయిడ్ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 1 జీబీ 4జీ డేటా, వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటులో ఉంటుంది.

జియో రూ.249.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడీటీ 23 రోజులు ఉంటుంది. అపరిమిత కాలింగ్, అన్ లిమిటెడ్ 5జీ డేటాతో పాటు రోజూ 1.5 జీబీ 4జీ డేటా, వంద ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు.

ఎయిర్ టెల్ రూ.295.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో 30 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. 25 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా అదనంగా వస్తుంది.

రిలయన్స్ జియో రూ.259.. నెల రోజుల పాటు ఉండే ప్రీపెయిడ్ ప్రణాళిక. అన్ లిమిటెడ్ 5జీ డేటా, అపరిమిత కాలింగ్, రోజూ వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. రోజుకు 1.5 జీబీ 4జీ డేటా అదనం.

ఎయిర్ టెల్ రూ.299.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అన్ లిమిడెట్ కాలింగ్, 5 జీ డేటాతో పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపించవచ్చు.

జియో రూ.299.. అపరిమిత 5జీ డేటాతో పాటు కాలింగ్ చేసుకునే సదుపాయం ఉంది. రోజుకు 2జీబీ డేటా, వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. 28 రోజులు పాటు చెల్లుబాటులో ఉంటుంది.

ఎయిర్ టెల్ రూ.319.. ఇది ప్రీపెయిడ్ ప్లాన్. అపరిమిత 5జీ డేటాతో పాటు అన్ లిమిడెట్ కాల్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు, 2 జీబీ డేటా అదనంగా పొందవచ్చు.

జియో రూ.349.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అన్ లిమిటెడ్ 5జీ డేటాతో పాటు కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు, 2.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది.

ఎయిర్ టెల్ రూ.359.. అన్ లిమిటెడ్ 5జీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లతో పాటు 2జీబీ 4జీ డేటా పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెల రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

ఎయిర్ టెల్ రూ.399.. ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రోజూ 2.5 జీబీ డేటా వస్తుంది. అపరిమిత 5జీ డేటా, కాల్స్ సదుపాయం కూడా ఉంది.

జియో రూ.419.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో అన్ లిమిటెడ్ 5జీ డేటా, అపరిమిత కాల్స్ పొందవచ్చు. రోజూ వంద ఎస్ఎమ్ఎస్ లతో పాటు 3జీబీ 4జీ డేటా బోనస్ గా లభిస్తుంది.

ఎయిర్ టెల్ రూ.455.. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్స్, అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. రోజూ 6జీబీ 4జీ డేటాతో పాటు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి.

ఎయిర్ టెల్ రూ.479.. రోజూ 1.5 జీబీ 4జీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చు. 56 రోజులు వ్యాలిడీటీ ఉంటుంది. అపరిమిత కాల్స్ తోపాటు రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి.

ఎయిర్ టెల్ రూ.499.. ఈ ప్లాన్ వ్యాలిడీటీ 28 రోజులు ఉంటుంది. అన్ లిమిటెడ్ 5జీ డేటా, కాలింగ్ సదుపాయం లభిస్తుంది. రోజుకు 3జీబీ 4జీ డేటాతో పాటు వంద ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు. మూడు నెలల పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో