Tablet: పిల్లల విద్య నుంచి వృద్ధుల వినోదం వరకు పెద్ద స్క్రీన్‌తో కూడిన టాబ్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లోని వైఫై లేదా మొబైల్ హాట్ స్పాట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. మీరు కొత్త టాబ్లెట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే 4 టాబ్లెట్ ఎంపికల ఉత్తమమని చెప్పవచ్చు. అంతేకాదు వీటి ధర కూడా రూ.10,000 కంటే తక్కువే. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
1. శామ్సంగ్ టాబ్లెట్
మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 8.0ని రూ.9999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే వినియోగదారులు 512 GB వరకు SD కార్డ్‌ను ఇందులో చేర్చవచ్చు. దీనిలో 7.99 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. అలాగే ఇది 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 9.0లో పని చేస్తుంది. 5100 mAh బ్యాటరీ సెటప్ కలిగి ఉంది.
2. లెనోవో టాబ్లెట్
ఈ లెనోవో టాబ్లెట్ 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 8-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది వెనుక ప్యానెల్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 2-మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ టాబ్లెట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో సింగిల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీని సహాయంతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
3. మోటరోలో ట్యాబ్
మోటరోలో G20 టాబ్లెట్ 3 GB RAM, 32 GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇందులో వినియోగదారులు మెమరీని పెంచడానికి మైక్రో SD కార్డ్‌ను ఉపయోగించవచ్చు. దీని వెనుక ప్యానెల్‌లో 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 5100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11లో పని చేస్తుంది.
4. ఆల్కాటెల్ టాబ్లెట్
మీరు ఆల్కాటెల్ టాబ్లెట్‌ను రూ.9499కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 8-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4080 mAh బ్యాటరీతో నడుస్తుంది. వాయిస్ కాల్స్ కోసం సింగిల్ SIMకి మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్‌లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.