Cow Milk: ఆవు పాలు లేత పసుపు రంగులో.. గేదె పాలు తెల్లగా ఎందుకుంటాయి..?

|

Jan 05, 2022 | 10:11 AM

Cow Milk: సాధారణంగా పాలు అనేవి తెల్లగా ఉంటాయి. కానీ ఆవు పాలు కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి. అలా లేత పసుపు రంగులో ఎందుకు ఉంటాయనే..

Cow Milk: ఆవు పాలు లేత పసుపు రంగులో.. గేదె పాలు తెల్లగా ఎందుకుంటాయి..?
Follow us on

Cow Milk: సాధారణంగా పాలు అనేవి తెల్లగా ఉంటాయి. కానీ ఆవు పాలు కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి. అలా లేత పసుపు రంగులో ఎందుకు ఉంటాయనే విషయం మీరు ఎప్పుడైనా గమనించారా..? ఇలా కొన్ని జంతులువ పాలు తెల్లగా ఉంటే.. కొన్ని కొన్ని జంతువుల పాలు కాస్త వేరే రంగులో కనిపిస్తుంటాయి. ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండకపోవడానికి ప్రత్యేక కారణమే ఉంటుంది. ఆవు పాలలో బీటా కెరోటిన్‌ అనే పదార్థం కొంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ఆ పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. అదే గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి.

చిన్న పిల్లలకు ఏ పాలు మంచివి..?
చిన్న పిల్లలకు గేదె పాల కంటే ఆవు పాలు మంచివంటారు. వాటిలో కొవ్వు పదార్థం తక్కువ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం అవుతుటాయి. వాటిలో బీటి కెరోటిన్‌ ఏ విటమిన్‌గా మార్పు చెంది చిన్నారులకు ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తి ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో మార్పులు ఉంటాయి.

కొవ్వు పదార్థం శాతం..
ఆవుపాలు, గేదె పాల వలన కొన్ని లాభాలు, నష్టాలూ ఉంటాయి.  ఆవు పాలతో పోల్చుకుంటే.. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కూడా పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలు లో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుండి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీనితో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేట్‌గా ఉంచుతుంది. కానీ గేదె పాలలో అలా కుదరదు.

పాలలో ప్రోటీన్స్‌
ఇక ప్రోటీన్ల విషయానికొస్తే ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10శాతంకుపైగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల గేదె పాలు పెద్దలకు మంచిదని చెబుతున్నారు నిపుణులు.

రెండు పాలల్లో క్యాలరీ శాతం..
ఈ రెండు పాలల్లో ఉండే కేలరీల శాతం చూస్తే.. గేదె పాలలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు పదార్థం, ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Guava Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. అలాంటి వారికి అదిరిపోయే బెనిఫిట్స్‌..!

Health Care Tips: పాలతో పాటు వీటిని తింటున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు..!