AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Recharges: పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బాదుడు షురూ..

ఈ ఎన్నికల హడావుడిలో ఓ వార్త మొబైల్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోని ప్రజలు మొబైల్ రీఛార్జ్‌పై ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధం కావాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్‌లను పెంచేందుకు అన్ని సన్నాహాలు చేశారు.

Mobile Recharges: పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బాదుడు షురూ..
Recharge Plan
Nikhil
|

Updated on: Apr 13, 2024 | 3:44 PM

Share

భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్ని పార్టీలు ఎన్నికల్లో నిమగ్నమయ్యాయి. అలాగే ప్రజలు కూడా ఆయా పార్టీల ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికల హడావుడిలో ఓ వార్త మొబైల్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోని ప్రజలు మొబైల్ రీఛార్జ్‌పై ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధం కావాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్‌లను పెంచేందుకు అన్ని సన్నాహాలు చేశారు. అంటే ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్‌లు ఖరీదైనవి కానున్నాయి. ఇందుకోసం కంపెనీలు పూర్తిగా సిద్ధమై ఈసారి ఎంత డబ్బు పెంచాలనుకుంటున్నాయో? కూడా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత రీచార్జ్ ప్లాన్‌లు ఏ స్థాయిలో పెరగనున్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ నివేదిక ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమలో టారిఫ్‌లు 15 నుండి 17 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నివేదిక ప్రకారం టెలికాం పరిశ్రమలో టారిఫ్ పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత పెంపు ఖాయమని భావిస్తున్నారు. దీని వల్ల భారతీ ఎయిర్‌టెల్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల తర్వాత పరిశ్రమ ఛార్జీలను 15 నుంచి 17 శాతం పెంచుతుందని భావిస్తున్నామని నివేదిక పేర్కొంది. 

ఎయిర్‌టెల్ ఫీజును చివరిసారిగా డిసెంబర్ 2021లో దాదాపు 20 శాతం పెంచింది. అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత టారిఫ్‌లు పెరగనున్నాయి. ఎయిర్‌టెల్ రూ. 208 రీచార్జ్ రూ.286 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.భారతి ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ సంవత్సరానికి రెండు శాతం పెరుగుతుందని భావిస్తున్నామని నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 2018లో వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 37.2 శాతం నుండి దాదాపు సగానికి అంటే 2023 డిసెంబర్‌లో 19.3 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో భారతి మార్కెట్ వాటా 29.4 శాతం నుండి 33 శాతానికి పెరిగింది. ఈ కాలంలో జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..