Telegram: యూజర్ల డేటాపై వాట్సాప్‌ నిఘా పెడుతోంది.. సంచలన ఆరోపణలు చేసిన టెలిగ్రామ్‌ ఫౌండర్‌..

వ్యాపార ప్రత్యర్థుల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణమైన విషయం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా సహజమే. అయితే దిగ్గజ టెక్‌ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైతే, అవి కాస్త సంచలన ఆరోపణలకు దారి తీస్తే..

Telegram: యూజర్ల డేటాపై వాట్సాప్‌ నిఘా పెడుతోంది.. సంచలన ఆరోపణలు చేసిన టెలిగ్రామ్‌ ఫౌండర్‌..
Telegram Founder Comment On WhatsApp

Updated on: Oct 10, 2022 | 11:50 AM

వ్యాపార ప్రత్యర్థుల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణమైన విషయం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా సహజమే. అయితే దిగ్గజ టెక్‌ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైతే, అవి కాస్త సంచలన ఆరోపణలకు దారి తీస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల మధ్య అలాంటి వాతావరణమే నెలకొంది. తాజాగా టెలిగ్రామ్‌ ఫౌండర్‌ పావెల్‌ డురోవ్‌ వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

వాట్సాప్‌ ఒక సర్వైలెన్స్ టూల్ అని, దానిని ఉపయోగించవద్దంటూ బాంబ్‌ పేల్చేశారు. ఈ విషయమై పావెల్ డురోవ్ మాట్లాడుతూ..’వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌లను హ్యాకర్లు పూర్తిగా యాక్సెస్ చేసే రిస్క్ ఉంటుంది. యూజర్ల డేటాపై వాట్సాప్‌ నిఘా ఉంచుతోంది. వాట్సాప్‌లో తలెత్తే సెక్యూరిటీ సమస్యలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవే. వాట్సాప్‌లోని సమస్యలన్నీ యూజర్ల డివైజ్‌లను రిస్క్‌లో పెడుతున్నాయి’ అంటూ ఆరోపించారు.

వెంటనే వాట్సాప్‌ను ఉపయోగించడం మానేయాలని చెప్పిన పావెల్‌.. టెలిగ్రామ్‌ను ఉపయోగించమని తన ఉద్దేశం కాదని చెప్పడం కొసమెరుపు. టెలిగ్రామ్‌కు అదనంగా ఎలాంటి ప్రచారం అసవరం లేదని, టెలిగ్రామ్ ప్రైవసీ-ఫస్ట్ విధానంతో ముందుకుసాగుతోందని చెప్పుకొచ్చారు. అయితే వాట్సాప్‌ మాత్రం ప్రైవసీ పెద్ద పీట వేస్తున్నామని, ఇందులో భాగంగానే ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిష్షన్‌ విధానాన్ని తీసుకొచ్చామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..