Tecno Pova 6 Neo 5G: మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న టెక్నో నయా ఫోన్.. ధరెంతో తెలిస్తే షాక్

|

Sep 14, 2024 | 4:15 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరగింది. ముఖ్యంగా భారతదేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో చాలా కంపెనీలు ఎప్పకటికప్పుడు నయా స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో సూపర్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో పోవా 6 నియో 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను రూ.12,999 ధరతో అందుబాటులో ఉంచింది.

Tecno Pova 6 Neo 5G: మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న టెక్నో నయా ఫోన్.. ధరెంతో తెలిస్తే షాక్
Tecno Pova 6 Neo 5g
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో చాలా కంపెనీలు ఎప్పకటికప్పుడు నయా స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో సూపర్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో పోవా 6 నియో 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను రూ.12,999 ధరతో అందుబాటులో ఉంచింది. మీడియా టెక్ ప్రాసెసర్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉండే పోవా 6 నియో 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టెక్నో పోవా 6 నియో 5జీ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో వస్తుంది. టెక్నో పోవా 6 నియో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తుంది. పైగా ఈ ఫోన్‌లో స్టోరేజ్ విస్తరించడానికి మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ సదుపాయం కూడా ఉంది. 

ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతి ఫోన్‌లో ఉంటున్న ఏఐ ఫీచర్స్ ఈ ఫోన్‌లో కూడా ఉన్నాయి. కెమెరాలో 3ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, సూపర్ నైట్ మోడ్, టైమ్-లాప్స్, డ్యూయల్ వీడియో వంటి ఫీచర్లతో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఆకట్టుకుటుంది. ఇంక ఏఐ ఫీచర్స్ విషయానికి ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఏఐ కటౌట్, ఏఐ వాల్ పేపర్ వంటి వాటితో వస్తున్నాయి. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత అలాగే ఐపీ 54 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్ రెండు ర్యామ్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. 6 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.13,999 వరకు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌తో అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..