Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?

Mobile Fast Charging: ఇప్పుడున్న టెక్నాలజీలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు గంటలకుపైగా ఛార్జింగ్‌ పెడుతుంటే ఇప్పుడు కేవలం నిమిషాల్లోనే ఛార్జింగ్‌ అయ్యే ఫోన్లు ఉన్నాయి. కానీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉన్న ఫోన్లతో నష్టాలు కూడా ఉంటాయని గుర్తించుకోండని టెక్‌ నిపుణులు..

Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?

Updated on: Apr 29, 2025 | 4:32 PM

ఇలా రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అయితే ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లకు ఉండేది బ్యాటరీ. బ్యాటరీ బ్యాకప్‌ ఎంత ఇస్తుందనే దానిపై చాలా మంది దృష్టి సారిస్తుంటారు. అయితే తక్కువ సమయంలోనే ఫుల్‌ ఛార్జింగ్‌ అయ్యే స్మార్ట్‌ ఫోన్‌లను వెతుకుతుంటారు. అయితే అయితే ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయని గుర్తించుకోండి.

ఇప్పుడున్న టెక్నాలజీలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు గంటలకుపైగా ఛార్జింగ్‌ పెడుతుంటే ఇప్పుడు కేవలం నిమిషాల్లోనే ఛార్జింగ్‌ అయ్యే ఫోన్లు ఉన్నాయి. కానీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉన్న ఫోన్లతో నష్టాలు కూడా ఉంటాయని గుర్తించుకోండని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ ఛార్జర్‌ వల్ల త్వరగా ఛార్జింగ్‌ అవుతుంది. దీని వల్ల మీరు సమయం ఆదా చేసుకోవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి?
అయితే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అయ్యే ఫోన్‌లతో నష్టాలు కూడా ఎన్నో ఉంటాయని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా స్పీడ్‌గా ఛార్జింగ్‌ అయ్యే ఫోన్‌ల వల్ల ఫోన్‌ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదండోయ్‌..మీ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ కూడా తగ్గిపోతుంది. ఫోన్‌ పదేపదే వేడెక్కడం ప్రారంభం అవుతుంది. మున్ముందు ఫోన్‌తో సమస్య వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కావడం వల్ల మీ ఫోన్‌లో హీటింగ్‌ సమస్య ఏర్పడుతుంది. అధికంగా వేడి అవ్వడం వల్ల ఫోన్‌ పోలియే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందుకే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎప్పుడు కూడా మీ ఫోన్‌తో వచ్చే ఛార్జర్‌తోనే ఛార్జింగ్‌ చేయడం మంచిది. అంతేగానీ మార్కెట్లో నాణ్యత లేని ఛార్జర్‌లను కొనుగోలు చేస్తే మీ ఫోన్‌ పాడయ్యే అవకాశం కూడా ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి