Laptop Battery: నేటి జీవితంలో ల్యాప్‌టాప్ ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. పని, చదువు, వినోదం వంటి వివిధ అవసరాలకు ల్యాప్‌టాప్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కానీ ల్యాప్‌టాప్‌లతో మనం చేసే సాధారణ తప్పులు బ్యాటరీని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జ్ త్వరగా తగ్గే సమస్యలను మనం తరచుగా ఎదుర్కొంటాము. ల్యాప్‌టాప్ నాణ్యత దీనికి కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ బ్యాటరీ పనితీరు మనం దానిని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది.
కొన్ని సులభమైన జాగ్రత్తలతో మీరు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అలాగే తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. మనం చేసే కొన్ని సాధారణ తప్పులను, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు
బ్యాటరీ జీవితాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు
- మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. బ్యాటరీ 20 శాతం కంటే తగ్గకుండా చూసుకోండి. అదేవిధంగా ఛార్జర్ 80 నుండి 90 శాతానికి చేరుకున్న తర్వాత దాన్ని తీసివేయండి.
- బ్యాటరీకి వేడి అతిపెద్ద శత్రువు. మీ ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ చదునైన ఉపరితలంపై ఉంచండి. దానిని మంచం లేదా దుప్పటిపై ఉంచడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీని వలన ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది.
- మీ ల్యాప్‌టాప్‌లో పవర్ సేవర్ మోడ్ / బ్యాటరీ సేవర్ మోడ్‌ను ప్రారంభించడం వల్ల బ్యాటరీ లోడ్ తగ్గుతుంది. అది ఎక్కువసేపు ఉంటుంది.
- అనవసరమైన సాఫ్ట్‌వేర్ బ్యాక్ రౌండ్‌లో నడుస్తుంటే మీ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. టాస్క్ మేనేజర్ ద్వారా వాటిని నియంత్రించడం వల్ల బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది.
- స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అందుకే అవసరమైనంత వరకు బ్రైట్‌నెస్ తక్కువగా ఉంచండి. బాగా వెలుతురు ఉన్న గదుల్లో మీ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించండి.
- ఉపయోగంలో లేనప్పుడు Wi-Fi, బ్లూటూత్‌లను ఆఫ్ చేయండి. అవి బ్యాటరీ శక్తిని ఎక్కువగా వినియోగిస్తాయి. అందుకే అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయండి.
- బ్యాటరీని తరచుగా 0 శాతానికి చేరుకునే వరకు ఉపయోగించడం వల్ల దాని జీవితకాలంపై ప్రభావం చూపుతుంది. బ్యాటరీ పవర్ 20 నుండి 30 శాతానికి చేరుకున్నప్పుడు మళ్ళీ ఛార్జింగ్ ప్రారంభించండి.
- ప్రతి కొన్ని నెలలకు ఒకసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసి అది పూర్తిగా ఖాళీ అయ్యే వరకు దాన్ని ఉపయోగించండి. ఇది బ్యాటరీ సెన్సార్ సరిగ్గా పనిచేయడానికి, దాని జీవితకాలం పొడిగించడానికి సహాయపడుతుంది.
- అవసరమైనప్పుడు మీ ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్రైవర్లను అప్‌డేట్ చేయడం ద్వారా మీరు బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు.
- మీరు మీ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించనప్పుడు దాన్ని పూర్తిగా షట్ డౌన్ చేయండి. మరోవైపు దానిని ఎక్కువసేపు స్లీప్ మోడ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మరో సూపర్ ప్లాన్.. చౌకైన రీఛార్జ్‌తో 65 రోజుల వ్యాలిడిటీ
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి