Technology: కరెంట్ పోయినా ఇక ఫ్యాన్ ఆగదు.. ఇలా చేస్తే అసలు కరెంట్ బిల్లే రాదు.. అద్దిరిపోయే న్యూస్ మీకోసం..!

|

May 06, 2023 | 7:15 AM

వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు నాన్‌స్టాప్‌గా నడుస్తుంటాయి. పిల్లలకు వేసవి సెలవు ఉండటంతో అవి 24 గంటలు రన్నింగ్‌లోనే ఉంటాయి. దీని కారణంగా కరెంటు వినియోగం పెరిగి.. బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇక ఈ వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన విద్యుత్ కొరత ఉంటుంది. దానివల్ల అనేక మంది అవస్థలు పడుతుంటారు.

Technology: కరెంట్ పోయినా ఇక ఫ్యాన్ ఆగదు.. ఇలా చేస్తే అసలు కరెంట్ బిల్లే రాదు.. అద్దిరిపోయే న్యూస్ మీకోసం..!
Hydro Generator
Follow us on

వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు నాన్‌స్టాప్‌గా నడుస్తుంటాయి. పిల్లలకు వేసవి సెలవు ఉండటంతో అవి 24 గంటలు రన్నింగ్‌లోనే ఉంటాయి. దీని కారణంగా కరెంటు వినియోగం పెరిగి.. బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇక ఈ వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన విద్యుత్ కొరత ఉంటుంది. దానివల్ల అనేక మంది అవస్థలు పడుతుంటారు. కొందరైతే జనరేటర్, ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకుంటారు. అంతసామర్థ్యం లేని వాళ్లు ఇబ్బంది పడుతారు. అయితే, కరెంట్ కోతలతో ఇబ్బంది పడే వారందరికీ ఉపయోగకరమైన.. అద్దిరిపోయే న్యూస్ తీసుకువచ్చాం. అదేంటో కింద చదివేసేయండి..

సాధారణంగా కరెంట్ పోతే.. ఫ్యాన్ ఆగిపోతుంది. దాంతో ఉక్కపోతకు అల్లాడిపోతారు. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. కరెంట్ పోయిన తరువాత కూడా ఫ్యాన్ నాన్ స్టాప్‌గా నడుస్తుంది. ఇన్వర్ట్లు పెట్టాల్సిన పని లేదు, అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే విద్యుత్ జనరేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వర్టర్ అవసరం లేదిక..

1. హైడ్రో జనరేటర్ ఉపయోగించి, మీరు మీ ఇంట్లో అమర్చిన వాటర్ ట్యాంక్ నుండి విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. ఇంటి ట్యాంక్‌లో హైడ్రో జనరేటర్‌ను అమర్చడం ద్వారా విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేయవచ్చనే ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

2. నీటి వేగాన్ని బట్టి హైడ్రో జనరేటర్ పనిచేస్తుంది. నీటి పైపులా కనిపించే హైడ్రో జనరేటర్‌లో టర్బైన్, దానికి అనుసంధానించబడిన డైనమో ఉంటాయి. ఈ టర్బైన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.

4. విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా వాటర్ ట్యాంక్‌లో ఈ హైడ్రో జనరేటర్‌ను ఎలా అమర్చాలో తెలుసుకుందాం.

5. ట్యాంక్‌లోని నీటిని నింపి విడుదల చేసినప్పుడు, అది పైపు ద్వారా వెళ్ళే విధంగా వాటర్ ట్యాంక్‌లో హైడ్రో జనరేటర్‌ను అమర్చాలి. ఈ ప్రక్రియ తర్వాత, హైడ్రో జనరేటర్లో ఇన్స్టాల్ చేయబడిన టర్బైన్ పనిచేయడం ప్రారంభిస్తుంది.

6. ఆ తర్వాత టర్బైన్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీంతో ఏదైనా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఆ బ్యాటరీతో మీ ఇంటి అవసరాలకు విద్యుత్‌ను ఉపయోగించొచ్చు.

7. ఈకామర్స్ వెబ్‌సైట్లలో హైడ్రో జనరేటర్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో ఈ జనరేటర్లు విక్రయానికి ఉన్నాయి. హైడ్రో జనరేటర్ ధర దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..