UPI: యూపీఐ పేమెంట్స్‌లో మరో సూపర్ ఫీచర్‌.. స్కాన్‌, ఫోన్‌ నెంబర్‌ లేకుండానే..

డిజిటల్‌ పేమెంట్ యాప్స్‌ సైతం యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, చాలా సులభంగా యాక్సెస్‌ చేసే వీలు ఉండడంతో ప్రతీ ఒక్కరూ సులభంగా యాప్స్‌ను ఉపయోగిస్తూ పేమెంట్స్‌ చేసేస్తున్నారు. ఇక యూపీఐ సేవల్లో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా.. యూపీఐ పేమెంట్‌ సంస్థలకు కీలక సూచన చేసింది. జనవరి 31వ తేదీ...

UPI: యూపీఐ పేమెంట్స్‌లో మరో సూపర్ ఫీచర్‌.. స్కాన్‌, ఫోన్‌ నెంబర్‌ లేకుండానే..
Upi Payments
Follow us

|

Updated on: Dec 28, 2023 | 3:16 PM

నగదు రహిత లావాదేవీలు దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవల రాకతో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రకాల లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఇక గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌ వంటి ఎన్నో రకాల యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో డిజిటల్‌ పేమెంట్స్ పెరిగిపోయాయి.

డిజిటల్‌ పేమెంట్ యాప్స్‌ సైతం యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, చాలా సులభంగా యాక్సెస్‌ చేసే వీలు ఉండడంతో ప్రతీ ఒక్కరూ సులభంగా యాప్స్‌ను ఉపయోగిస్తూ పేమెంట్స్‌ చేసేస్తున్నారు. ఇక యూపీఐ సేవల్లో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా.. యూపీఐ పేమెంట్‌ సంస్థలకు కీలక సూచన చేసింది. జనవరి 31వ తేదీ నుంచి యూపీఐ సేవల్లో ‘ట్యాప్‌ అండ్‌ పే’ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం మనం యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే క్యూఆర్‌ కోడ్ స్కానింగ్‌ లేదా మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నాం. అయితే ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఎలాంటి స్కానింగ్ కానీ ఫోన్‌ నెంబర్‌ కానీ అవసరం లేకుండానే డబ్బులు పంపించుకోవచ్చు. యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసే క్రంమలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ గతంలోనే తెలిపారు.

ఈ విధానంలో కెమెరాకు బదులుగా నాన్‌ ఫీల్డ్‌ కమ్యూఇనకేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయితే ఈ సదుపాయం కేవలం ఎన్‌ఎఫ్‌సీ అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో మాత్రమే ఉంటుంది. యూపీఐ యాప్‌లో ఉండే టాప్‌ అండ్‌ పే అనే బటన్‌ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎలాంటి పిన్‌ లేకుండానే డబ్బులు ఇతరులకు సెండ్ చేయొచ్చు. ఇదిలా ఉంటే ఈ సేవలు కేవలం రూ. 500 కంటే తక్కువ లావాదేవీలకు మాత్రమే పరిమితమని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..