కారు అయినా, బైక్ అయినా.. ఎండలో పార్క్ చేస్తే కలర్ షేడ్ అవ్వడమో, ఇంజిన్ సమస్య రావడమో, బండిలోని డీజిల్, పెట్రోల్ ఆవిరి కావడమో, బండి హీట్ ఎక్కడమో, ఒక్కోసారి వేడి తీవ్రత ఎక్కువై వాహనంలో మంటలు చెలరేగడమో జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో వాహనాలను ఎలా కాపాడుకోవాలి? అందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టిప్స్ ద్వారా మీ వాహనాన్ని కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో సొంత వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వస్తువులను ఉపయోగిస్తే ఎండలో ప్రయాణించినా, ఆ ప్రయాణం సురక్షితంగా, సులభంగా, సరదాగా నడుస్తుంది.
సన్ షేడ్స్ ఉపయోగించాలి: వేసవి కాలంలో కారులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ కారులో సన్‌షేడ్‌లను ఉపయోగించాలి. కారు ఎండలో పార్క్ చేస్తే విండ్‌షీల్డ్‌పై కూడా సన్‌షేడ్‌ని ఉపయోగించాలి. ఇలా చేస్తే బయటి వేడి లోపలికి వెళ్లకుండా ఉంటుంది.
సోలార్ పవర్ ఫ్యాన్: కారులో సోలార్ పవర్ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇది సౌరశక్తితో పని చేస్తుంది. కారు విండ్ షీల్డ్‌పై గానీ, విండోపై గానీ ఇన్‌స్టాల్ చేయాలి. ఎండలో నిరంతరాయంగా కారు నడవడం వల్ల క్యాబిన్ నుంచి వేడి వస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీ కారు చల్లగా ఉండేందుకు ఈ ఫ్యాన్ ఉపకరిస్తుంది. ఈ ఫ్యాన్ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటు ఉంటుంది.
ఫ్యాన్ అమర్చిన వెంటిలేటెడ్ సీట్ కవర్: చాలా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ మోడళ్లలో ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఒకవేళ మీ కారులో వెంటిలేటెడ్ సీట్ కవర్ లేనట్లయితే.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ నుండి లేదా ఆన్‌లైన్‌లో వెంటిలేటెడ్ సీట్ కవర్‌లను కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..