
గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అంతరిక్ష రంగంలో దినాభివృద్ది చెందుతోంది. అనేక ప్రయోగాలు చేపడుతూ ప్రపంచాన్ని ఆకర్షించడంతో పాటు పురోగతిని సాధిస్తోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం, నావిగేషన్, క్యూనినేషన్ వ్యవస్థలను విస్తరిస్తూ ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రధాన శక్తిగా అవతరిస్తోంది. అయితే కొన్ని అంతరిక్ష ప్రయోగాలు సజావుగా ముగిసే అవకాశం ఉండదు. అవసరం తీరాక భూమి చుట్టూ వాటి అవశేషాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా ఇస్రో వెల్లడించిన వివరాలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది శాస్త్రవేత్తలను ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన స్థానాన్ని చాటుతున్నప్పటికీ… శిథిలాలు విషయం కాస్త ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇస్రో అధికారిక డేటా ప్రకారం.. ప్రస్తుతం భారతదేశ కక్ష్యలో భూమి చుట్టూ 129 అంతరిక్ష శిథిలాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిల్లో 49 పనిచేయని ఉపగ్రహలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ ఉపగ్రహలు ప్రస్తుతం ఇనాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్లాయి. దీంతో భూమికి సమీప కక్ష్యలో పరిభ్రమిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇక రాకెట్ భాగాలు, అంతరిక్ష శిథిలాలు, ప్రయోగాల తర్వాత మిలిగిపోయిన శిథిల శకాలు వీటిల్లో ఉన్నాయి. ఇక ఇవి ఢీకొనడం వల్ల ఏర్పడిన ముక్కలు, పాత ప్రయోగాల నుంచి విడిపోయిన భాగాలు కూడా వీటిల్లో ఉన్నట్లు ఇస్రో చెబుతోంది. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, ఎల్‌వీఎమ్ 3, పీఎస్‌ఎల్వీ సీ3 రాకెట్ల నుంచి విడిపోయి శకలాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ నుంచి విడిపోయిన 33 శకాలాలు ఉన్నాయి.
ఈ శకలాలు చిన్నవి అయినప్పటికీ.. ఇవి ప్రయాణించే వేగం కారణంగా ప్రమాద ముప్పును కలిగించే అవకాశాలున్నాయి. సుమారు సెకన్‌కు 10 కిలోమీటర్ల వేగంతో ఇవి కదలుతాయి. పనిచేస్తున్న ఉపగ్రహన్ని ఇవి ఢీకొడితే తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. పరస్పరం ఢీకొనడం వల్ల వేలాది కొత్త శిథిల భాగాలు కూడా ఏర్పడతాయి. ఇది కక్ష్యలో ప్రమాదాన్ని మరింత పెంచుతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న శిథిలాలను తొలగించే ప్రక్రియకు కూడా పరిశోధకులు శ్రీకారం చుట్టారు. 2025లో స్పాడెక్స్ మిషన్‌లో డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇనాక్టివ్ అయిన ఉపగ్రహలను, శిధిలాలను పట్టుకోవడం వంటి భవిష్యత్ మిషన్లకు ఇది చాలా ముఖ్యమైనది. అంతరిక్ష వస్తువులను పర్యవేక్షించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహడపడుతుంది. సాధ్యమైనంతగా ప్రమాదాలకు గురయ్యే ఈ శిధిలాలను ఏరివేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వీటిని గుర్తించి శుభ్రపర్చడానికి ఇస్రో అనేక ప్రయత్నాలు చేస్తోంది.