Twitter CEO Elon Musk : త్వరలోనే ట్విట్టర్‎లో బ్లూటిక్ మాయం, ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!!

ట్విట్టర్‎ సర్వీసును కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు...

Twitter CEO Elon Musk : త్వరలోనే ట్విట్టర్‎లో బ్లూటిక్ మాయం, ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!!
Twitter

Edited By: Narender Vaitla

Updated on: Feb 13, 2023 | 10:40 AM

ట్విట్టర్‎ సర్వీసును కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ కంపెనీపై తనదైన ముద్ర వేసుకుంటూ పనిచేస్తున్న మస్క్ తాజాగా బ్లూటిక్ సర్వీసును పెయిడ్ సర్వీసుగా మార్చి సంచలనానికి తెరలేపాడు. అయితే తాజాగా ఇప్పటివరకు ఉన్నటువంటి బ్లూటిక్ అకౌంట్లకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ లను త్వరలోనే తొలగిస్తామని మస్క్ ప్రకటించడం విశేషం.

భారతదేశంలో నెలకు రూ. 650 నుండి ప్రారంభమయ్యే ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సర్వీసును విడుదల చేసిన తర్వాత, ఎలాన్ మస్క్ అన్ని లెగసీ బ్లూ బ్యాడ్జ్‌లు త్వరలో తీసివేస్తానని తెలిపాడు. వినియోగదారులకు ఛార్జీలు విధించడం ద్వారా తన ప్లాట్‌ఫారమ్‌ని డబ్బు ఆర్జించడంలో బిజీగా ఉన్నందున, కంపెనీ బ్లూ టిక్కులను తొలగిస్తుందని మస్క్ ఇదివరకే చెప్పారు. “లెగసీ బ్లూ టిక్కులు త్వరలో తీసివేస్తామన్నారు. ఇలా బ్లూటిక్కులను ఇవ్వడం అనైతికమని ఈ సందర్భంగా మస్క్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో, ట్విట్టర్ సీఈఓ మస్క్ మాట్లాడుతూ, అన్ని లెగసీ వెరిఫైడ్ ఖాతాలు ‘అనైతికమైనవి అందుకే’ త్వరలో వాటి బ్లూ బ్యాడ్జ్‌లను కోల్పోతాయని అన్నారు. “Twitter లెగసీ బ్లూ వెరిఫైడ్ దురదృష్టవశాత్తు దుర్వినియోగం అయ్యిందని త్వరలోనే ఇది ముగింపునకు చేరుకుంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వెబ్‌లో వెరిఫికేషన్‌తో బ్లూ సర్వీస్ కోసం నెలకు రూ. 650గా నిర్ణయించింది. భారతదేశంలోని ఆండ్రాయిడ్, iOS మొబైల్ పరికరాలపై రూ. 900 వసూలు చేస్తుంది. ట్విటర్ భారతదేశంలో సంవత్సరానికి రూ. 6,800 తగ్గింపు వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తోంది, ఇది నెలకు దాదాపు రూ. 566.67 చార్జ్ చేస్తుంది. భారత్ లో ప్రారంభించడంతో, Twitter బ్లూ ఇప్పుడు US, కెనడా, జపాన్, UK, సౌదీ అరేబియాతో సహా 15 ప్రపంచ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే మస్క్ తాజాగా ట్విట్టర్ ఖాతాలను సంస్కరించేందుకు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఫేక్ ఎకౌంట్లను అలాగే చాట్ బాట్లను గుర్తించి త్వరలోనే ట్విట్టర్ను మరింత సంస్కరింప చేస్తామని ప్రకటించారు. అయితే గతంలో కూడా మాస్క్ ఈ చాట్ బాట్ ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పాత యాజమాన్యంతో ఇదే విషయమై విభేదాలను కూడా కొని తెచ్చుకున్నారు. నిజానికి చాట్ బాట్స్ అనేవి చాలా అనైతికమైనవి. యూజర్లను మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఈ చాట్ బాట్లను ఉపయోగిస్తారు. అయితే భారత్, సహా అనేక ప్రపంచ దేశాల్లో వ్యాపార, రాజకీయ వర్గాల్లోని కొంత మంది ఈ చాట్ బాట్లను ఉపయోగించి, యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీనిపై మస్క్ సైతం చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఈ చాట్ బాట్లను తొలగించడం అంత సులభమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..