Smart Ring: వామ్మో.. స్మార్ట్‌ రింక్‌ ఇంత డేంజరా? ధరిస్తున్న వారు తప్పక తెలుసుకోవాల్సిందే..

స్మార్ట్ రింగులు ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ప్రసిద్ధి. అయితే, ఒక యూజర్ తన శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్‌లోని బ్యాటరీ ఉబ్బి, వేలు వాచి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. విమాన ప్రయాణం రద్దై, ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన స్మార్ట్ రింగ్‌ల భద్రత, బ్యాటరీ సమస్యలపై తీవ్ర ఆందోళనలను పెంచింది.

Smart Ring: వామ్మో.. స్మార్ట్‌ రింక్‌ ఇంత డేంజరా? ధరిస్తున్న వారు తప్పక తెలుసుకోవాల్సిందే..
Smart Ring

Updated on: Sep 30, 2025 | 9:47 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది చేతికి స్మార్ట్‌ బ్యాండ్లు, అలాగే చేతి వేలికి స్మార్ట్‌ రింగులు ధరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ రింగులు మన శరీరాన్ని నిరంతరం ట్రాక్‌ చేస్తుంటాయి. మన ఎంత సేపు నిద్రపోయాం, ఎన్ని అడుగులు వేశాం, ఎంత విశ్రాంతి అవసరం వంటి విషయాలు మనకు తెలియజేస్తుంటాయి. ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు ఎక్కువగా ఈ స్మార్ట్‌ రింగులను ధరిస్తున్నారు. అయితే తాజాగా స్మార్ట్‌ రింగ్‌ ధరిస్తున్న వ్యక్తి ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించాడు.

స్మార్ట్‌ రింగ్‌ ధరించిని కారణంగా తాను ఆస్పత్రి పాలైనట్లు తెలిపాడు. మరోసారి స్మార్ట్‌ రింగ్‌ను ధరించనంటూ పేర్కొన్నాడు. ఒక ప్రముఖ టెక్ యూట్యూబర్ తన శామ్సంగ్ గెలాక్సీ రింగ్ చెడిపోవడం, వేలు వాపు రావడం, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లిన బాధాకరమైన పరిస్థితిలో పడ్డాడు. ఈ సంఘటన అతనికి నొప్పిని కలిగించడమే కాకుండా, బోర్డింగ్ నిరాకరించడానికి కూడా దారితీసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆన్‌లైన్‌లో @ZONEofTECH గా పిలువబడే డేనియల్ రోటర్.. దాదాపు 47 గంటల ప్రయాణం తర్వాత విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నప్పుడు తన శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ బ్యాటరీ ఉబ్బడం ప్రారంభమైంది. దాంతో వేలికి బిగుసుకుపోయింది. దీనివల్ల ఆ రింగ్‌ తీసివేయడం కుదరలేదు. ఎయిర్‌పోర్ట్‌లోని భద్రతా సిబ్బంది ఈ సమస్యను భద్రతా ప్రమాదంగా గుర్తించారు. దీని కారణంగా అతన్ని విమానం ఎక్కేందుకు నిరాకరించి.. అతన్ని ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్య సిబ్బంది వాపు తగ్గడానికి చికిత్స అందించారు. ఆ తర్వాత నీరు, సబ్బు, హ్యాండ్ క్రీమ్‌తో రింగ్‌ను చేతి వేలి నుంచి వేరు చేశారు. ఆ తర్వాత రింగ్‌ చూస్తే లోపల బ్యాటరీ ఉబ్బి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రోటర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. స్మార్ట్‌ రింగ్‌ కారణంగా తాను ఎంత ఇబ్బంది పడిందో వివరించాడు. అతని పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్మార్ట్‌ రింగ్‌ల వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి