Slack Users Asked To Change Their Password: ‘స్లాక్‘ మొబైల్ యాప్.. మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ యాప్ లాక్‌డౌన్ తర్వాత బాగా పాపులర్ అయ్యింది. కారణం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడమే.
ఈ ప్రముఖ బిజినెస్ యాప్‌తో ఉద్యోగులంతా ఒక గ్రూప్ కింద చేరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియోలు, ఫొటోలను, టెస్ట్స్ డేటాను చాలా సులభంగా పంపుకోవ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఈయాప్ నిర్వాహాకులు కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. అయితే ఈ కొత్త యాప్‌లో బగ్ ఉన్నట్లు గుర్తించారు. స్లాక్ నూతన వెర్షన్ వాడుతున్న వారి పాస్‌వర్డ్‌లకు ఏమాత్రం రక్షణ లేదని.. వెంటనే యూజర్లను అప్రమత్తం చేశారు. యాప్‌లో ఎంటర్ అయిన బగ్ కారణంగా పాస్‌వర్డ్ సమాచారానికి ముప్పు ఏర్పండిందని, వెంటనే కొత్త పాస్‌వర్డ్ మార్చుకోవాలని యూజర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా.. ఈమెయిల్‌తో పాటు ఓ లింక్‌ను కూడా పంపారు. సదరు లింక్‌పై క్లిక్ చేసి పాస్‌వర్డ్ మార్చుకోవాలని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం కేవలం ఈ-మెయిల్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే వారికి మాత్రమే ఉందని, వారి సమాచారమే లీకైందని వెల్లడించారు. సింగిల్ సైన్ ఆన్ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
Also Read: Postal APP: ఖాతా తెరవడానికి పోస్టాఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..