Gas Cylinder: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఈ చిట్కాలతో ఎక్కువ రోజులు!

|

Jun 20, 2024 | 4:54 PM

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ను వినియోగించని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌పైనే వంట చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఈ సిలిండర్ ధరలు సామాన్యుడికి ఎప్పుడూ తలనొప్పిగా ఉంటున్నాయి. ప్రస్తుతం ధర దిగి వచ్చినప్పటికీ మళ్లీ ఎప్పుడు పెరుగుతుందోననే ఆందోళన ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ తమ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావడానికి..

Gas Cylinder: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఈ చిట్కాలతో ఎక్కువ రోజులు!
ఆ తర్వాత సిలిండర్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా చేయడం వల్ల సిలిండర్‌లో కొంత భాగం పొడిగా కనిపిస్తుంది. కొన్ని భాగాలు ఇప్పటికీ తేమగా ఉండటం చూస్తారు. అందువలన సిలిండర్‌ ఖాళీ భాగం ఎండిపోవడం ప్రారంభమవుతుంది. తడిసిన స్థలం ద్వారా సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.
Follow us on

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ను వినియోగించని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌పైనే వంట చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఈ సిలిండర్ ధరలు సామాన్యుడికి ఎప్పుడూ తలనొప్పిగా ఉంటున్నాయి. ప్రస్తుతం ధర దిగి వచ్చినప్పటికీ మళ్లీ ఎప్పుడు పెరుగుతుందోననే ఆందోళన ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ తమ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావడానికి ప్రయత్నిస్తుంటారు. కాని కొందరికి గ్యాస్‌ త్వరగా అయిపోతుంటుంది. గ్యాస్ త్వరగా అయిపోకుండా ఎక్కువ రోజులు వచ్చే చిట్కాలను అందిస్తాము.

ఇది కూడా చదవండి: School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

ఈ చిట్కాలను గ్యాస్ ఆదా చేసుకోవచ్చు

  1. వంట చేసేటప్పుడు చాలా సార్లు మనం తడి పాత్రలను గ్యాస్‌పై ఉంచుతాము. అటువంటి పరిస్థితిలో తడి పాత్రను ఆరబెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో చాలా గ్యాస్ వృధా అవుతుంది. ఒక గుడ్డతో తుడిచిన తర్వాత మాత్రమే పాత్రను ఎల్లప్పుడూ గ్యాస్ మీద ఉంచాలని గుర్తుంచుకోండి.
  2. వంట చేసేటప్పుడు వీలైనంత వరకు ప్రెజర్ కుక్కర్ ఉపయోగించండి. కుక్కర్‌లో ఆహారం చాలా త్వరగా తయారవుతుంది. ఇది గ్యాస్‌ను ఆదా చేస్తుంది. దీనితో పాటు, ఆహారాన్ని వండేటప్పుడు ఎల్లప్పుడూ పాత్రను కప్పి ఉంచాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఆహారం వేగంగా ఉడికిపోతుంది. అలాగే గ్యాస్ వినియోగం తగ్గుతుంది.
  3. గ్యాస్ బర్నర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. చాలా సార్లు ఎక్కువసేపు శుభ్రం చేయకపోవడం వల్ల గ్యాస్ బర్నర్‌లో చాలా ధూళి పేరుకుపోతుంది. దీని వల్ల గ్యాస్ సరిగా మండదు. అలాగే గ్యాస్‌ వృధా అవుతుంటుంది. మంట రంగును చూడటం ద్వారా బర్నర్‌కు శుభ్రపరచడం అవసరమా లేదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు. మంట రంగు మారినట్లయితే అది శుభ్రం చేయవలసిన అవసరం ఉందని అర్థం.
  4. తరచుగా మనం ఫ్రిజ్ నుండి నేరుగా పాలు వంటి వాటిని తీసుకొని గ్యాస్ మీద ఉంచుతాము. ఇలా చేయడం ద్వారా ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఎందుకంటే పాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. రిఫ్రిజిరేటర్‌లో ఏదైనా వస్తువును గ్యాస్‌పై ఉంచే ముందు దాన్ని బయటకు తీయండి. తర్వాత దాని ఉష్ణోగ్రత సాధారణమైనప్పుడు దానిని గ్యాస్‌పై ఉంచండి.
  5. ఎల్లప్పుడూ తక్కువ మీడియం మంట మీద ఆహారాన్ని ఉడికించాలి. ఎక్కువ మంట మీద వంట చేయడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. అలాగే పైపు నుండి ఏదైనా లీకేజీ ఉందో లేదో తెలుసుకోవడానికి సిలిండర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండండి. మీరు ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే మీ గ్యాస్ సిలిండర్ మునుపటి కంటే చాలా ఎక్కువ రోజులు వస్తుందది. కావాలంటే ఓ సారి ట్రై చేసి చూడండి.

ఇది కూడా చదవండి: Power Banks: 20,000 mAh పవర్‌ బ్యాంకు కేవలం రూ.350కే.. అందులో ఏముంటుందో తెలిస్తే మైండ్‌బ్లాంకే.. వీడియో

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి