AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPS walls: ఇళ్లు కట్టేప్పుడు ఈ ఒక్క పనిచేస్తే చాలు.. ఇక మీకు ఏసీ, కూలర్లతో పనే ఉండదు..

వర్షాకాలం మొదలైన తగ్గని ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఇప్పుడు సరికొత్త EPS వాల్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ ప్యానెల్ గోడలు, పైకప్పు నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా AC అవసరం లేకుండానే ఇళ్లను సహజంగా చల్లగా ఉంచుకోవ్చు. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి, ఖర్చులను ఆదా చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.

EPS walls: ఇళ్లు కట్టేప్పుడు ఈ ఒక్క పనిచేస్తే చాలు.. ఇక మీకు ఏసీ, కూలర్లతో పనే ఉండదు..
Eps Wall Technology
Anand T
|

Updated on: Jun 28, 2026 | 5:53 PM

Share

తెలుగురాష్ట్రాల్లో ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏసీ అవసరం లేకుండా ఇళ్లను చల్లగా ఉంచేలా ఓ సరికొత్త టెక్నాలజీ ఇప్పుడు తెగ వైరల్‌గా మారుతోంది. అవును EPS వాల్ టెక్నాలజీ అనే సరికొత్త నిర్మాణ విధానం ఇంటికి చల్లగా ఉంచడంతో చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకూ ఇది ఇంటిని ఎలా చల్లగా ఉంచుతుందో తెలుసుకుందాం పదండి.

EPS వాల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

EPS.. అంటే ఎక్స్‌పాండెడ్ పాలిస్టైరిన్.. సాధారణంగా మనం థర్మాకోల్ అని పిలిచే మెటీరియల్‌తోనే ఈ ఈపీఎస్‌ వాల్స్‌ను తయారు చేస్తారు. ఈ పాలిస్టైరిన్ పూసలను ఉబ్బించడం ఈ గట్టి ఫోమ్ మెటీరియల్‌లా తయారు చేస్తారు.ఈ మెటీరియల్ లోపల ఎక్కవ మొత్తంలో గాలిని స్టోర్ చేస్తారు. కాబట్టి ఎండకొట్టే సమయంలో ఇంది వేడిని ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రసరించకుండా అడ్డుకుంటుంది. అందుకే బయట ఎండలు ఎక్కువగా ఉన్నట్టు భవనాల్లో ఉష్ణోగ్రతను తగ్గించడానికి గోడలు, పైకప్పుల నిర్మాణంలో EPS ప్యానెళ్లను ఎక్కువగా వినియోగిస్తారు. వీటితో ఉండే మరో బెనిఫిట్ ఏమిటంటే.. ఇవి చాలా తేలికగా ఉండటం వల్ల భవనంపై బరువు కూడా ఎక్కవగా పడదు.

ఇళ్లను ఇది ఎలా చల్లగా ఉంచుతుంది?

EPS ప్యానెళ్లలో క్లోజ్డ్-సెల్ నిర్మాణం ఉంటుంది.. ఇది గాలిని లోపలే పట్టి ఉంచుతుంది. ఇది బయటి వేడిని గోడల గుండా ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ఒక కవచంలా పనిచేస్తుంది. సాధారణ ఇటుక, సిమెంట్ గోడలతో పోలిస్తే, EPS గోడలు ఉన్న ఇళ్లలో వేసవి కాలంలో కూడా లోపలి ఉష్ణోగ్రత స్థిరంగా, చల్లగా ఉంటుంది. దీని వల్ల ఇంట్లో ఏసీలు, కూలర్లు వాడే అవసరం ఉండదు. దీంతో కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది.. అలాగే మన నెలవారి ఖర్చులు కూడా తగ్గుతాయి.

EPS ఇతర ప్రయోజనాలు

ఈ ప్యానెళ్లు బరువు తక్కువగా ఉండటం వల్ల వీటిని రవాణా చేయడం, నిర్మాణ స్థలంలో అమర్చడం కూడా చాలా ఈజీ. భవనం బరువును పెంచకుండానే, ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఈ రోజుల్లో ఇళ్లు కట్టేప్పుడే వీటిని ఎక్కవ మంది వినియోగిస్తున్నారు. వీటిని కేవలం గోడలకే కాకుండా, ఇంటి పైకప్పులో కూడా వాడవచ్చు.. దీని వల్ల ఇంటి పైనుంచి వచ్చే ఎండ వేడిని పూర్తిగా తగ్గించవచ్చు.

అయితే కేవలం EPS ప్యానెళ్లను ఇంటి గోడలును నిర్మించరు.. మనం ఇంటి నిర్మాణంలో రెగ్యులర్‌గా వాడే ఇటుకలు, సిమెంట్, ఐరన్ మెష్ వంటి ఇతర సామాగ్రితో కలిపి ఈ ఈపీఎస్ గోడలుగా నిర్మిస్తారు. ఈ టెక్నాలజీ దీర్ఘకాలం మన్నికగా ఉండాలంటే నిపుణుల పర్యవేక్షణలో సరైన వెంటిలేషన్, తేమ చేరకుండా ప్రొటెక్టివ్ లేయర్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కరెంటు బిల్లు తగ్గించి.. ఇంటిని చల్లగా ఉంచే సరికొత్త టెక్నాలజీ..
కరెంటు బిల్లు తగ్గించి.. ఇంటిని చల్లగా ఉంచే సరికొత్త టెక్నాలజీ..
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!
వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌
వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌
గోదావరి ఒడ్డున ముగ్గులాంటి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళితే..
గోదావరి ఒడ్డున ముగ్గులాంటి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళితే..
త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!
త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!
భాగ్యరాజ్ మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే..
భాగ్యరాజ్ మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే..
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!