Samsung Galaxy M05: అతి తక్కువ ధరలో నయా స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సామ్‌సంగ్.. అదరగొడుతున్న సూపర్ ఫీచర్స్

|

Sep 14, 2024 | 3:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకుని సేల్స్ పెంచుకోవడానికి అన్ని కంపెనీలు అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌లు రిలీజ్ చేస్తున్నాయి.

Samsung Galaxy M05: అతి తక్కువ ధరలో నయా స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సామ్‌సంగ్.. అదరగొడుతున్న సూపర్ ఫీచర్స్
Samsung Galaxy M05
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకుని సేల్స్ పెంచుకోవడానికి అన్ని కంపెనీలు అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే భారతదేశంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న సామ్‌సంగ్ కంపెనీ కూడా ఇటీవల మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా నయా స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 05 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను కేవలం రూ.7999కే అందుబాటులో ఉంచింది. ఈనేపథ్యంలో సామ్2సంగ్ గెలాక్సీ ఎం05 ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సామ్‌సంగ్ కంపెనీ భారతదేశంలో 50 ఎంపీ కెమెరాతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 05ను ఇటీవల విడుదల చేసింది. ముఖ్యంగా సామ్‌సంగ్ ఎం సిరీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు అనే నానుడికి నిజం చేస్తూ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం05ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌తో రిలీజ్ చేశారు. అలాగే ఈ ఫోన్‌ను కేవలం రూ.7,999కు అందుబాటులో ఉంచారు. అయితే సామ్‌సంగ్ గెలాక్సీ ఎం05 స్మార్ట్ ఫోన్ చాలా శక్తివంతమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 

సామ్‌సంగ్ ఎం05 మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ డ్యూయల్ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా అంతర్నిర్మిత నిల్వను 1టీబీ వరకు విస్తరించవచ్చు. ముఖ్యంగా సామ్‌సంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న మెమరీని వాస్తవంగా 8 జీబీ వరకు విస్తరించవచ్చు. అలాగేే ఈ ఫోన్‌ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..