Samsung: కేవలం రూ.13 వేలకే శాంసంగ్ నుంచి కళ్లు చెదిరే ట్యాబ్.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు
విద్యార్థులు, ఉద్యోగులకు ట్యాబ్ అవసరం చాలా ఉంటుంది. అలాంటి వారికి తక్కువ ధరలోనే ట్యాబ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు కూడా వస్తున్నాయి. తాజాగా శాంసంగ్ తక్కువ ధరలో ట్యాబ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్ల వివరాలు..

Samsung Galaxy Tab A11: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లో దూసుకెళ్తుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఫీచర్లతో కూడి ఫోన్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అప్‌గ్రేడ్ వెర్షన్ ఫోన్లను ఇతర సంస్ధల కంటే ముందుగానే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. హై-రేంజ్, మిండ్- రేంజ్ ఫోన్లనే కాదు బడ్జెట్ ఫోన్లను కూడా విడుదల చేస్తూ కస్టమర్లను పెంచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్లనే కాకుండా ట్యాబ్లను కూడా తీసుకొస్తుంది. ఇటీవలే ట్యాబ్ A11++ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేయగా.. అది వచ్చిన కొద్ది రోజుల్లో గెలాక్సీ ట్యాబ్ A11 మోడల్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ ట్యాబ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటి? అనే విషయాలు చూద్దాం.
ఫీచర్లు
-8.7-అంగుళాల LCD డిస్‌ప్లే
-90Hz రిఫ్రెష్ రేట్
-మీడియాటెక్ హీలియో చిప్‌సెట్
-మైక్రో SD కార్డ్ స్లాట్
-వెనుకవైపు 8ఎంపీ కెమెరా
-ముందువైపు 5ఎంపీ కెమెరా
-డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్పీకర్, హెడ్‌ఫోన్ జాక్
-5,100mAh బ్యాటరీ సామర్థ్యం
ధర
ఈ ట్యాబ్ రెండు వేరియెంట్లలో లభిస్తుంది. వైఫై, LTE వెర్షన్లలో ఈ ట్యాబ్ వస్తుంది. 4జీబీ+64జీబీ వేరియెంట్ వైఫై మోడల్ ధర రూ.12,999గా ఉంది. ఇక LTE వెర్షన్ ధర రూ.15,999గా ఉంది. ఇక వైఫై వెర్షన్ 8GB + 128GB వేరియెంట్ ధర రూ. 17,999గా ఉంది. ఇక LTE వెర్షన్ల ధర రూ.20,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఇక ఆఫ్‌లైన్లో కొనుగోలు చేయాలంటే శాంసంగ్ స్టోర్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
త్వరలో వన్‌ప్లస్ నుంచి ట్యాబ్
త్వరలో వన్‌ప్లస్ ప్యాడ్ గో వెర్షన్ ట్యాబ్‌ను ఇండియాలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఇది 5జీ సపోర్ట్‌ను అందిస్తుంది. మీడియాటెక్ చిప్‌సెట్‌తో రానున్న ఈ ఫోన్ వెనుక ఒకే కెమెరా కలిగి ఉంటుంది. దీని ధర రూ.20 వేల కంటే తక్కువ ఉంటుందని చెబుతున్నారు




