Samsung Festive Sale: శామ్సంగ్ ఉత్పత్తులపై తిరుగులేని, తిరిగిరాని ఆఫర్లు.. మిస్ అయితే బాధపడతారు..
ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ పేరిట ప్రత్యేక సేల్ ను తీసుకొచ్చింది. దీనిలో కంపెనీకి సంబంధించిన అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లను అందుబాటులో ఉంచింది. ఈ సేల్ శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంది. అలాగే శామ్సంగ్ షాప్ యాప్ లోనూ డీల్స్ చూడొచ్చు. మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్, గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ వంటివి కొనుగోలు చేయాలంటే ఇదే బెస్ట్ టైం.

పండుగల సీజన్ వచ్చేసింది.. ఇంటింటా సంబరాలు తెచ్చేసింది. కొత్త వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లో జోష్ నెలకొంది. కంపెనీలు ఆఫర్ల జాతరను ప్రారంభించాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అన్న తేడా లేకుండా అన్ని స్టోర్లలోనూ ఫెస్టివ్ సేల్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ పేరిట ప్రత్యేక సేల్ ను తీసుకొచ్చింది. దీనిలో కంపెనీకి సంబంధించిన అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లను అందుబాటులో ఉంచింది. ఈ సేల్ శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంది. అలాగే శామ్సంగ్ షాప్ యాప్ లోనూ డీల్స్ చూడొచ్చు. మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్, గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ వంటివి కొనుగోలు చేయాలంటే ఇదే బెస్ట్ టైం. అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ఈ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 14 వరకూ కొనసాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం రండి..
ల్యాప్ టాప్స్.. శామ్సంగ్ అందిస్తున్న ప్రత్యేక సేల్లో ల్యాప్ టాప్ పై అదిరే ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డులపై వీటిని కొనుగోలు చేస్తే 20శాతం వరకూ రివార్డు వచ్చే అవకాశం ఉంది. అలాగే శామ్సంగ్ గెలాక్సీ ల్యాప్ టాప్ లపై 36శాతం వరకూ ఆదా చేసుకొనే వెసులబాటు ఉంది.
ట్యాబ్లెట్లు, యాక్సెసరీస్.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇతర ప్రధాన బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ తో పాటు 20శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే గెలాక్సీ ట్యాబ్లెట్లు, యాక్ససరీస్, వేరబుల్స్ ను కొనుగోలు చేస్తే 41శాతం వరకూ డిస్కౌంట్లు ఈ ప్రత్యేకమైన సేల్లో లభిస్తున్నాయి.
టీవీలు.. పలు రకాల మోడళ్లపై బంపర్ ఆఫర్లను శామ్సంగ్ అందిస్తోంది. నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ, 4కే యూహెచ్డీ టీవీలు, ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ వంటి వాటిపై 54శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. 98 అంగుళాలా క్యూ ఎల్ఈడీ, నియో క్యూఎల్ఈడీ టీవీ మోడళ్ల కొనుగోలుపై మీరు శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా పొందొచ్చు.
రిఫ్రిజిరేటర్లు.. శామ్సంగ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లపై 40శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి అదనంగా ఎవరైనా ఈ రిఫ్రిజిరేటర్లు కొనుగోలు చేస్తారో వారికి 10కేజీ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లేదా గెలాక్సీ ఎస్ 23 128జీబీ స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా అందిస్తారు.
వాషింగ్ మెషీన్స్.. శామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్, ఎకో బబుల్ లైన్ పై వినియోగదారులు 37శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
మైక్రోవేవ్స్.. మీరు కిచిన్ అప్లయన్సెస్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. మైక్రోవేవ్స్ పై ఏకంగా 34శాతం తగ్గింపు లభిస్తోంది.
మోనిటర్స్.. గేమర్స్ అలాగే ప్రొఫెషనల్స్ మంచి లుకింగ్ ఉన్న డిస్ ప్లే సెటప్ కోసం ఎదురుచూస్తుంటే మీరు ఇప్పడే శామ్సంగ్ ఎం8 స్మార్ట్ మోనిటర్ అలాగే గేమ్స్ కోసం జీ5 గేమింగ్ మోనిటర్ కొనుగోలు చేయొచ్చు. దీనిపై 58శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
ఎయిర్ కండిషనర్స్.. వినియోగదారులు శామ్సంగ్ విండ్ ఫ్రీ ఎయిర్ కండిషనర్స్ పై 40శాతం వరకూ తగ్గింపును పొందుతారు.
- ఇవి కాక కచ్చితమైన శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై 70శాతం బై బ్యాక్ ను అందిస్తోంది. గెలాక్సీ జెడ్ సిరీస్, ఎస్ సిరీస్, ఏ సిరస్ స్మార్ట్ ఫోన్లపై ఈ బై బ్యాక్ అందుబాటులో ఉంటుంది. అంతేకాక వినియోగదారులు శామ్సంగ్ టీవీలు, డిజిటల్ అప్లయన్సెస్, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు వేరబుల్స్, ల్యాప్ టాప్ లను హెచ్డీ ఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై ఏకంగా 27.5శాతం గరిష్టంగా రూ. 25,000 వరకూ బ్యాంకు క్యాష్ బాక్ ను అందుకోవచ్చు. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 14 వరక కొనసాగనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..