Telugu News Technology Realme offers huge discount on account of Holi, get realme 12 pro 5G very less price, check details in telugu
Holi 2024: ఈ 5జీ ఫోన్లపై హోలీ ఆఫర్స్.. ఏకంగా రూ. 4000 వరకూ తగ్గింపు..
రియల్ మీ 12 ప్రో సిరీస్ 5జీ ఫోన్లపై హోలీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. రియల్ మీ 12 ప్రో ప్లస్ 5జీ, రియల్ మీ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే రియల్ మీ 12 సిరీస్ ఫోన్లు కూడా ఆఫర్ ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఆఫర్ ధరలకు రియల్ మీ 12 ప్లస్ 5జీ, రియల్ మీ 12 5జీ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ లేదా రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో కొనుగోలు చేయొచ్చు.
హోలి అంటేనే రంగుల సంబరం. అప్పటి వరకూ ఉన్న జీవితంలో కష్ట నష్టాలు, బాధల బంధీలను పక్కకు నెట్టి.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గడపుతారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందంగా ఉంటారు. ఈ సంబరాన్ని మరింత అందంగా మార్చేందుకు ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ రియల్ మీ హోలీ ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అద్బుతమైన డీల్స్ ను ప్రకటించింది. రియల్ మీ 12 ప్రో సిరీస్ 5జీ, రియల్ మీ 12 సిరీస్ 5జీ ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఆయా ఫోన్ల కొనుగోలుపై రూ. 5000 వరకూ తగ్గింపులు అందిస్తోంది. మార్చి 21న ప్రారంభమైన సేల్ మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఈ ఆఫర్లు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రియల్ మీ 12 ప్రో సిరీస్ 5జీ ఫోన్లపై హోలీ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. రియల్ మీ 12 ప్రో ప్లస్ 5జీ, రియల్ మీ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే రియల్ మీ 12 సిరీస్ ఫోన్లు కూడా ఆఫర్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ 12 ప్లస్ 5జీ, రియల్ మీ 12 5జీ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లేదా రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో కొనుగోలు చేయొచ్చు.
రియల్ మీ 12ప్లస్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 1000 వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే ప్రత్యక కూపన్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. రూ. 1000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదే ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ పై రూ. 1500 వరకూ బ్యాంక్ ఆఫర్, ఎక్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది.
రియల్ మీ 12 5జీ స్మార్ట్ పోన్ పై రూ. 2000 వరకూ క్యాష్ తగ్గింపుతో పాటు ప్రత్యేకమైన కూపన్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి రూ. 1000 విలువ చేసే సూపర్ కాయిన్, బ్యాంక్ ఆఫర్ అందిస్తుంది. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఇదే వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 1500 బ్యాంక్ ఆఫర్లు లభిస్తున్నాయి. దీంతో పాటు రూ. 1500 వరకూ ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
రియల్ మీ 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 1000 కూపన్ లభిస్తుంది. దీంతో పాటు రూ. 4000 వరకూ బ్యాంక్ తగ్గింపులు లభిస్తాయి. మరో రూ. 3000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది.
రియల్ మీ 12 ప్రో 5జీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 3000 వరకూ బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే ఎక్స్ చేంజ్ బోనస్ గా రూ. 3000వరకూ ఉంటుంది.