
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ వరుసగా ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ వేరియంట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 10 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ10 ప్రో, రియల్‌మీ 10 ప్రో+ పేరుతో ఫోన్‌లను తీసుకురానున్నారు. నవంబర్ 9వ తేదీన మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..
రియల్‌మీ 10ప్రో స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ, 4 జీబీ+64 జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లలో వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో మెమొరీ కార్డ్‌తో ర్యామ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. కెమెరాకు అధికా ప్రధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. దాదాపు అన్ని మోడల్స్‌లోనూ ఇవే ఫీచర్లు ఉండనున్నాయి. అయితే రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో మరింత పవర్ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. 65 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4890 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ 10 సిరీస్ ఫోన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..