Smartphone: వన్‌ప్లస్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్.. ధర, కెమెరా క్వాలిటీ వివరాలు తెలుసుకుంటే షాకే..

OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 3 Lite ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 4న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Smartphone: వన్‌ప్లస్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్.. ధర, కెమెరా క్వాలిటీ వివరాలు తెలుసుకుంటే షాకే..
Oneplus Nord Ce 3 Lite

Edited By:

Updated on: Mar 28, 2023 | 4:03 PM

OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 3 Lite ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 4న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్ తేదీ దగ్గర పడుతుండగా, దాని స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్స్ ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్‌లో, OnePlus ఫోన్ ధర వెల్లడైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఏ ధరతో రిలీజ్ కానుందో తెలుసుకుందాం.

భారత్ లో ధర ఎంత ఉంటుంది?

ప్రసిద్ధ టిప్‌స్టర్ ప్రైస్‌బాబా ప్రకారం, OnePlus Nord CE 3 Lite భారతదేశంలో 8జీబీ + 128జీబీ మెమరీ కాన్ఫిగరేషన్‌లో ప్రారంభించబడుతుంది. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే అనే రెండు రంగుల ఎంపికలలో ఇది అందుబాటులో ఉంటుంది. ధరకు సంబంధించి, భారతదేశంలో OnePlus యొక్క MRP రూ. 27,999గా ఉండవచ్చని లీకులను బట్టి తెలుస్తోంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి

108 మెగాపిక్సెల్ కెమెరా:

లీక్‌లు, టీజర్‌ల ప్రకారం, Nord CE 3 Lite కొత్త డిజైన్‌తో లాంచ్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వవచ్చు. దీని ద్వారా వినియోగదారులు గొప్ప ఫోటోగ్రఫీ అనుభూతి పొందుతారు. అలాగే, కంపెనీ ఈ ఫోన్‌కు 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. అయితే, దాని పాత మోడల్ OnePlus Nord CE 2 Lite 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది.

ఈ కొత్త మోడల్ Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌లో కనిపించే డిస్‌ప్లే 6.72 అంగుళాల పెద్దదిగా ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..