Zoom Five9 Deal: టెక్నాలజీ రంగంలో మరో భారీ ఒప్పందానికి సర్వం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ ఏకంగా సుమారు 14.7 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. కరోనా కాలం తర్వాత ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్‌కు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలోనే జూమ్ ఈ ఒప్పందాన్ని చేసుకోనుందని తెలుస్తోంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్రొవెడర్ ఫైవ్9ను జూమ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ డీల్ కుదిరితే ఇకపై జూమ్‌కు ఫైవ్9 క్లౌడింగ్ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ యూనిట్‌గా మారనుంది. ఈ భారీ డీల్ 2022 ఫస్టాఫ్‌లో ఓ కొలిక్కి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జూమ్ కంపెనీ ప్రస్తుతం విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 7,92,450 కోట్లు. ఇక ఫైవ్ 9 కంపెనీ విషయానికొస్తే.. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్టవేర్ కంపెనీ సురక్షితమైన క్లౌడ్ సేవలను అందిస్తోంది. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్‌ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తమ యూజర్లు షేర్ చేసుకునే డాక్యుమెంట్లు మరింత సులభంగా ఉంటాయని జూమ్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Robot: సముద్ర గర్భంలో క్లిష్టమైన పరిశోధనలు..రోబోట్ సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు
Google Chrome: మీరు గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్ చేసుకోండి