బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్! ఇండియాలోకి వన్‌ప్లస్ నార్డ్ 6.. ఫీచర్లు ఇవే!
వన్‌ప్లస్ నార్డ్ 6 ఏప్రిల్ 7న విడుదల కానుంది. 9000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో ఇది రానుంది. 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP OIS కెమెరా, Android 16 వంటి అద్భుతమైన ఫీచర్‌లతో గేమర్‌లకు, రోజువారీ వినియోగదారులకు ఇది ఉత్తమ ఎంపిక.

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన మిడ్‌రేంజ్ నార్డ్ సిరీస్‌ను విస్తరిస్తూ కొత్తగా Nord 6ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన Nord 5కు అప్డేట్ వెర్షన్‌గా ఈ మోడల్ రానుంది. కంపెనీ ఇప్పటికే అమెజాన్‌లో మైక్రోసైట్‌ను ప్రారంభించి, ఏప్రిల్ 7ను విడుదల తేదీగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్, హోలోగ్రాఫిక్ క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. పనితీరు పరంగా ఇది 4nm టెక్నాలజీపై నిర్మించిన స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో వస్తుందని వెల్లడించారు. 12GB వరకు LPDDR5X RAM, 256GB స్టోరేజ్‌తో ఇది వేగవంతమైన మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED స్క్రీన్ ఇవ్వబడుతోంది. గరిష్టంగా 3,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ డిస్‌ప్లే అవుట్‌డోర్ వినియోగానికి కూడా అనువుగా ఉంటుంది. గేమింగ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్‌లో 165FPS వరకు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
9,000mAh సామర్థ్యంతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకు పైగా బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. కెమెరా పరంగా, 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో), 8MP సెకండరీ కెమెరా, అలాగే 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ Android 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రానుందని అంచనా.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
