Nokia 2660 Flip: నోకియా నుంచి మరో ఆకట్టుకునే ఫీచర్‌ ఫోన్‌.. తక్కువ ధరలో ఫ్లిప్‌..

|

Aug 30, 2022 | 7:20 AM

Nokia 2660 Flip: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నోకియా స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. అయితే అనంతరం ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేస్తూ...

Nokia 2660 Flip: నోకియా నుంచి మరో ఆకట్టుకునే ఫీచర్‌ ఫోన్‌.. తక్కువ ధరలో ఫ్లిప్‌..
Nokia 2660 Flip
Follow us on

Nokia 2660 Flip: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నోకియా స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. అయితే అనంతరం ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేస్తూ మళ్లీ మార్కెట్లో తన సత్తా చాటింది. ఈ క్రమంలోనే వరుసగా కొత్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. కేవలం స్మార్ట్‌ ఫోన్‌లనే కాకుండా ఫీచర్‌ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నోకియా మరో బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. నోకియా 2660 ఫ్లిప్‌ పేరుతో ఫోల్డింగ్ ఫోన్‌ను నోకియా ఈరోజు మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఫోల్డబుల్‌ ఫోన్లన్నీ భారీ ధరతో కూడుకున్నవి కాగా ఈ కొత్త ఫోన్‌ మాత్రం బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి రానుంది.

ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.. ఆ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ కాకుండా ప్రత్యేక కాయ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో రెండు డిస్‌ప్లేలు అంటాయి. ఫ్లిప్‌ తెరిచినప్పుడు పై భాగంలో 2.8 ఇంచెస్‌ క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. ఇక మూసినప్పుడు ముందు భాగంలో 1.77 ఇంచెస్‌ క్యూక్యూబీజీఏ స్క్రీన్‌ను అందిస్తున్నారు. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 2.75 వాట్స్‌కి సపోర్ట్‌ చేసే 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 4500 వరకు ఉండొచ్చని సమాచారం. మరికాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడు గంటలు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. ఇక ఫ్లాష్‌లైట్‌తో కూడిన కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్‌ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. 32 జీబీ మొమొరీ కార్డుకు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ను 48 ఎంబీ ర్యామ్‌/ 128 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. తక్కువ ధరలో ఫీచర్‌ ఫోన్‌ కోసం చూస్తోన్న వారికి నోకియా 2660 ఫ్లిప్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..