Kia Carens: కియా మోటార్స్ భారత్‌లో తన సరికొత్త మోడల్ కారెన్స్ బుకింగ్ ఈ రోజు నుంచి (జనవరి 14) ప్రారంభిస్తుంది. కంపెనీ నుంచి వస్తున్న నాలుగో మోడల్ కారు ఇది. అలాగే 2022లో మార్కెట్లో విడుదలయ్యే కార్లలో మొదటిది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను ఉన్నాయి. కియా కారెన్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు 6 నుంచి 7 సీట్లు కలిగి ఉంటుంది. అలాగే ఎంపీవీ ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో సెపరేటింగ్ లైన్ కూడా చూడవచ్చు. కియా కొత్తగా మార్కెట్లోకి తీసువస్తున్న ఈ కారు వరుసగా మూడు సీట్లతో ఉంటుంది. ఈ కారు ఐదు విభాగాలలో లభించనుంది. ప్రీమియం, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు1.5 పెట్రోలు, 1.4పెట్రోలు, 1.5డీజిల్ ఇంజిన్, 6ఎంటీ, 7డీసీటీ, 6ఏటీ ఆప్షన్లు ఉన్నాయి.
Kia Carens బుక్ చేసుకోవాలనుకునే వ్యక్తులు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ని సందర్శించి ముందస్తుగా రూ. 25,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.
కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు జోడించారు. అయితే కంపెనీ ఈ కారుకి సంబంధించి అధికారిక ధరను ప్రకటించలేదు.