Best Broadband Plans: ఆ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలపై ప్రత్యేక తగ్గింపులు… రూ.500 లోపు వచ్చే టాప్‌ ప్లాన్స్‌ ఇవే..!

ప్రతి ఇంట్లో వాడుకునేలా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల తప్పనిసరయ్యాయి. భారతదేశం వైవిధ్యమైన  సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించే అనేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు  వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి 2024లో భారతదేశంలో రూ. 500లోపు అత్యుత్తమమైన లేదా అగ్రశ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించే కంపెనీల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

Best Broadband Plans: ఆ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలపై ప్రత్యేక తగ్గింపులు… రూ.500 లోపు వచ్చే టాప్‌ ప్లాన్స్‌ ఇవే..!
Broadband

Edited By: Janardhan Veluru

Updated on: Jan 09, 2024 | 6:30 PM

పెరుగుతున్న టెక్నాలజీ భారతదేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వినియోగం ప్రతి ఇంట్లో తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి సేవలను పొందేందుకు నెట్‌ కనెక‌్షన్‌ కూడా తప్పనిసరి అవసరంగా మారింది. కాబట్టి ప్రతి ఇంట్లో వాడుకునేలా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల తప్పనిసరయ్యాయి. భారతదేశం వైవిధ్యమైన  సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించే అనేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు  వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి 2024లో భారతదేశంలో రూ. 500లోపు అత్యుత్తమమైన లేదా అగ్రశ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించే కంపెనీల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

జియో ఫైబర్‌ రూ. 399 ప్లాన్ 

రిలయన్స్‌ జియో రూ. 399 ప్లాన్ దాని బ్రాడ్‌బ్యాండ్ సేవ నుంచి కొనుగోలు చేయగల అత్యంత సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వరా 30 ఎంబీపీఎస్‌ వేగం, 3.3టీబీ నెలవారీ డేటా, ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌తో వస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 499 ప్లాన్ 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌కు సంబంధించిన రూ. 499 ప్లాన్ 40 ఎంబీపీఎస్‌ వేగం, 3.3 టీబీ డేటా, ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్, అపోలో 24×7 సర్కిల్, వింక్ మ్యూజిక్ ఉచితంగా వస్తుంది. 

ఇవి కూడా చదవండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 399 ప్లాన్ 

బీఎస్‌ఎన్‌ఎల్‌భారత్ ఫైబర్‌కు సంబంధించిన రూ. 399 ప్లాన్ ద్వారా 30 ఎంబీపీఎస్‌ వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు 1 టీబీ నెలవారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ సేవలను కూడా పొందవచ్చు. 

కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్ రూ. 499 ప్లాన్ 

కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి రూ. 499 ప్లాన్ 50 ఎంబీపీఎస్‌ వేగం, 3.3 టీబీ నెలవారీ డేటాతో వస్తుంది. కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్ అందించే ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా మనం పొందవచ్చు.

అలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ రూ. 425 ప్లాన్ 

కోల్‌కతాకు చెందిన అలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ దాని రూ. 425 ప్లాన్‌పై అపరిమిత డేటా, 40 ఎంబీపీఎస్‌ వేగంతో అందిస్తుంది. హంగామా ప్లే, లైవ్ టీవీకి సబ్‌స్క్రిప్షన్‌లతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ వంటివి ఏవీ అందించడం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..