AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్ కొంటున్నారా.. ఈ ఫీచర్స్ గురించి తెలియకపోతే నష్టపోవడం పక్కా..

మనం కొనేముందు మైలేజ్ ఎంత ఇస్తుంది? ధర ఎంత? అని మాత్రమే చెక్ చేస్తాం. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. టెక్నాలజీ పెరిగేకొద్దీ మన బైకులు కూడా స్మార్ట్‌ఫోన్లలా అడ్వాన్స్‌డ్‌గా మారిపోతున్నాయి. అయితే షోరూమ్‌కి వెళ్లినప్పుడు కొన్ని కీలక ఫీచర్లను తప్పనిసరిగా చెక్ చేయాలి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బైక్ కొంటున్నారా.. ఈ ఫీచర్స్ గురించి తెలియకపోతే నష్టపోవడం పక్కా..
New Bike Buying Guide
Krishna S
|

Updated on: Jul 20, 2026 | 3:46 PM

Share

ఒకప్పుడు బైక్ కొనాలంటే కేవలం ఇంజన్ కెపాసిటీ, మైలేజ్, ధర మాత్రమే చూసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు మోటార్ సైకిల్స్ కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చే ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలా మందికి ఈ ఫీచర్ల పేర్లు తెలుసు కానీ, వాటి అసలు ఉపయోగం ఏంటో తెలియదు. మీరు కూడా కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉంటే.. ఈ 7 ముఖ్యమైన ఫీచర్ల గురించి తప్పక తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఏబీఎస్

ప్రస్తుత రోజుల్లో బైక్‌లకు ఇది అత్యంత కీలకమైన సేఫ్టీ ఫీచర్. ప్రయాణంలో అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు బైక్ చక్రాలు లాక్ అయిపోకుండా ఈ సిస్టమ్ అడ్డుకుంటుంది. దీనివల్ల బైక్ స్కిడ్ అవ్వదు. ముఖ్యంగా వర్షంలో తడిచిన రోడ్లపై, ఇసుక రోడ్లపై బైక్ అదుపు తప్పకుండా రైడర్‌కు పూర్తి కంట్రోల్ ఇస్తుంది.

ట్రాక్షన్ కంట్రోల్

రోడ్డుపై పట్టు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. బైక్ వెనుక చక్రం అవసరానికి మించి వేగంగా తిరగకుండా ఇది నియంత్రిస్తుంది. దీనివల్ల బైక్ బ్యాలెన్స్ తప్పదు. సాధారణంగా ఈ ఫీచర్ కాస్త ఖరీదైన, ప్రీమియం బైకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

రైడ్ మోడ్స్

ఇప్పటి ఆధునిక బైకుల్లో ఎకో, రెయిన్, స్పోర్ట్ వంటి వేర్వేరు రైడింగ్ మోడ్స్ ఇస్తున్నారు. రోడ్డు పరిస్థితిని బట్టి బైక్ పవర్ డెలివరీని, థ్రోటిల్ రెస్పాన్స్‌ను మార్చుకోవచ్చు. ఉదాహరణకు.. వర్షం పడేటప్పుడు Rain Mode పెడితే బైక్ సేఫ్‌గా వెళ్తుంది, హైవేపై వేగంగా వెళ్లాలనుకుంటే Sport Mode వాడుకోవచ్చు.

క్రూయిజ్ కంట్రోల్

హైవేలపై సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా కంఫర్టబుల్ ఫీచర్. దీన్ని ఆన్ చేస్తే బైక్ మనం సెట్ చేసిన ఒకే వేగంతో వెళ్తుంది. పదే పదే యాక్సిలరేటర్ తిప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి చేతులకు అలసట ఉండదు. అయితే దీన్ని కేవలం ఖాళీగా, సురక్షితంగా ఉన్న హైవేలపై మాత్రమే వాడాలి.

స్లిప్పర్ క్లచ్

ఎక్కువ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా గేర్లు డౌన్ చేసినా వెనుక చక్రం అదుపు తప్పకుండా, లాక్ అవ్వకుండా ఈ స్లిప్పర్ క్లచ్ కాపాడుతుంది. దీనివల్ల బైక్ స్థిరంగా ఉంటుంది. గేర్లు మార్చడం చాలా స్మూత్‌గా, ఈజీగా అనిపిస్తుంది.

బ్లూటూత్ – డిజిటల్ ఫీచర్స్

ఇప్పుడు వస్తున్న కొత్త బైకులు స్మార్ట్‌ఫోన్‌లా మారిపోతున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా బైక్ నడుపుతున్నప్పుడే డిస్‌ప్లేపై కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు. అలాగే డిజిటల్ స్క్రీన్‌పై బైక్ స్పీడ్, మైలేజ్, ఏ గేర్‌లో ఉందో, ఎంత ఫ్యూయల్ ఉందో వంటి పూర్తి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి తోడు ఎల్‌ఈడీ లైటింగ్ బైక్‌కు ప్రీమియం లుక్‌తో పాటు రాత్రి పూట మంచి వెలుతురును ఇస్తుంది.

కొత్త బైక్ కొనేటప్పుడు కేవలం లుక్స్ మాత్రమే కాదు, పైన చెప్పిన ఫీచర్లు అందులో ఉన్నాయో లేదో చూసుకోవడం వల్ల మీ ప్రయాణం మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా మారుతుంది.

Follow Us