Microsoft: మైక్రోసాఫ్ అదిరిపోయే ఫీచర్.. ఇకపై వాయిస్‌తో ఇమెయిల్స్‌ని రాయొచ్చు.. అదెలాగంటే..

| Edited By: Phani CH

Jun 10, 2021 | 8:13 AM

Microsoft: మైక్రోసాఫ్ట్ తన ఔట్‌లుక్ మొబైల్ యాప్‌కు కోర్టానా సపోర్ట్ వాయిస్ ఫీచర్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. దాని సహాయంతో.. వినియోగదారులు..

Microsoft: మైక్రోసాఫ్ అదిరిపోయే ఫీచర్.. ఇకపై వాయిస్‌తో ఇమెయిల్స్‌ని రాయొచ్చు.. అదెలాగంటే..
Microsoft
Follow us on

Microsoft: మైక్రోసాఫ్ట్ తన ఔట్‌లుక్ మొబైల్ యాప్‌కు కోర్టానా సపోర్ట్ వాయిస్ ఫీచర్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది. దాని సహాయంతో.. వినియోగదారులు టైప్ చేయకుండానే వాయిస్ ద్వారా ఇమెయిల్‌లను కంపోజ్ చేయగలరని చెప్పింది. సమావేశాలను షెడ్యూల్ చేయడంతో పాటు.. వివరాలను కనుక్కోవచ్చునని పేర్కొంది. ఐఒఎస్ కోసం గతంలో ఔట్‌లుక్‌లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వాయిస్ మోడ్‌ను పరిపూర్ణం చేయడానికి అవుట్‌లుక్ మొబైల్‌లో కొత్త ఐకాన్‌ను చేర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వాయిస్‌తో ఇమెయిల్స్‌కు రిప్లై ఇవ్వవచ్చు అని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆన్‌లైన్ సమావేశాలను సులభతరం చేయడానికి, షెడ్యూలర్ కొత్త మైక్రోసాఫ్ట్ 365 సేవతో ముందుకు వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. “మీరు టైప్ చేస్తున్నదాన్ని షెడ్యూలర్ అర్థం చేసుకుంటుంది. అందువల్ల మీరు మీ అభ్యర్థనను కోర్టానాకు తెలియజేయవచ్చు. మీరు ఒక ఇమెయిల్‌లో సమావేశాన్ని షెడ్యూల్ చేయడానికి సహాయం కోసం ఒకరిని కోరినట్లే.. కొర్టొనాను కూడా కోరవచ్చు. ఇది మీరిచ్చే వాయిస్ కమాండ్ ఆధారంగా ఇమెయిల్స్‌ టైప్ అవుతుంది.’’ అని వివరించారు. షెడ్యూలర్ మైక్రోసాఫ్ట్ 365లో మానవ సహాయంతో రూపొందించిన తొలి కృత్రిమ మేధస్సు సేవగా నిలిచింది. అంతేకాదు.. ఇది కోర్టొనాను నిర్దిష్ట కీలకపదాలు లేకుండా పనిచేయడానికి అనుమతిస్తుంది.

మైక్రోసాఫ్ట్ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘‘షెడ్యూలర్‌తో, సమావేశాన్ని షెడ్యూల్ చేసినప్పుడు మీరు ఇచ్చే ఇన్‌పుట్స్ కోర్టానా కన్వర్ట్ చేసుకుంటుంది.’’ అని పేర్కొంది. ఇక విండోస్ 10 కోంస కోర్టానా నుంచి బ్రీఫింగ్ ఇమెయిల్స్ వంటి ఇతర సేవలను షెడ్యూలర్ స్వతంత్ర్యంగా కమాండ్ చేయగలుగుతాడంది.

Also read:

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‏లలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా..