WhatsApp New Feature: యూజర్ల కోరిక మేరకు కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై వీడియోలను..

|

Jul 03, 2021 | 8:23 AM

WhatsApp New Feature: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో మొదటి స్థానంలో ఉండే యాప్‌ ఏంటంటే వెంటనే వచ్చే సమాధానం వాట్సాప్‌. వినియోగదారుల అవసరాలకు, ఆకాంక్షలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు...

WhatsApp New Feature: యూజర్ల కోరిక మేరకు కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై వీడియోలను..
Whatsapp New Feature
Follow us on

WhatsApp New Feature: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో మొదటి స్థానంలో ఉండే యాప్‌ ఏంటంటే వెంటనే వచ్చే సమాధానం వాట్సాప్‌. వినియోగదారుల అవసరాలకు, ఆకాంక్షలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది కాబ్టటే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలోనే యూజర్ల కోరిక మేరకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వివరాల్లోకి వెళితే.. వాట్సాప్‌లో ఇప్పటి వరకు మనం కేవలం 16 ఎంబీ సైజ్‌లో ఉన్న వీడియోను మాత్రమే షేర్‌ చేసే సదుపాయం ఉంది. ఈ కారణంగా ఎక్కువ ఎంబీ ఉన్న వీడియోను పంపిస్తే వీడియో క్వాలిటీ తగ్గిపోతుంది. దీంతో వాట్సాప్‌లో హై క్వాలిటీ ఫీచర్లను సెండ్ చేయలేకపోతున్నామని గత కొన్ని రోజులుగా వాట్సాప్‌కు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్టులు వచ్చాయి.

దీంతో ఈ దిశగా అడుగులు మొదలుపెట్టిన వాట్సాప్‌ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే వీడియో అప్‌లోడ్‌ క్వాలిటీ పేరుతో వాట్సాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.21.14.6 ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు హై క్వాలిటీ వీడియోలను సెండ్‌ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా వాట్సాప్‌ ఆటో, బెస్ట్‌ క్వాలిటీ, డేటా సర్వర్‌ అనే మూడు ఆప్షన్లను జోడించనుంది. ఆటో ఆప్షన్‌ ద్వారా ఆప్షన్‌ ద్వారా వీడియో క్వాలిటీ తగ్గకుండా సైజును మాత్రమే తగ్గించి సెండ్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఇక బెస్ట్‌ క్వాలిటీ ఫీచర్‌తో హై రెజెల‍్యూషన్‌ వీడియోల్ని షేర్‌ చేసుకోవచ్చు. డేటా సేవర్‌ ఫీచర్‌ ఉపయోగాల విషయానికొస్తే.. ఈ ఆప్షన్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ హై బ్యాండ్‌ విత్‌ లేకపోయినా వీడియోను కంప్రెస్‌ చేసి సెండ్‌ చేసుకోవచ్చు.

Also Read: ఎగిరే కారు వచ్చేసిందోచ్‌…!! టెస్ట్‌ రైడ్‌ పూర్తి.. ఇక రెక్కలు విప్పుకుని రయ్…రయ్… ( వీడియో )

Twitter New Features: రెంచు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ట్విట్టర్.. ఇకపై మీ ట్వీట్ ఎవరికి కనిపించాలో కంట్రోల్ చేసుకోవచ్చు.

Black Death: ఐదువేల ఏళ్ళనాటి పుర్రె చెప్పిన నిజం.. బ్లాక్ డెత్ కలుగచేసే బాక్టీరియా అప్పటినుంచే ఉంది!