WhatsApp: నవంబర్‌ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఇందులో మీ మొబైల్‌ ఉందేమో చూసుకోండి.

WhatsApp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ఈ క్రమంలోనే లేటెస్ట్‌ వెర్షన్స్‌లో సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అయితే..

WhatsApp: నవంబర్‌ 1నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఇందులో మీ మొబైల్‌ ఉందేమో చూసుకోండి.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 09, 2021 | 7:22 AM

WhatsApp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ఈ క్రమంలోనే లేటెస్ట్‌ వెర్షన్స్‌లో సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అయితే తాజాగా వాట్సాప్‌ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నవంబర్‌ 1 నుంచి పలు మోడళ్లలో వాట్సాప్‌ కొత్త ఫీచర్స్‌ పనిచేయవని ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ 4.0.3 లేదా అంతకంటే తక్కువ ఓఎస్ మీద నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తోన్న ఆపిల్‌ మొబైల్స్‌లో కొత్త ఫీచర్లు పనిచేయవని తెలిపింది.

పలు మోడళ్లలో కొత్త ఫీచర్‌ అప్‌డేట్ చేయ‌డానికి పాత వెర్షన్స్‌ పనిచేయవని అందుకే ఆ మొబైళ్లలో కొత్త ఫీచర్స్‌ నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ పేర్కొంది. యూజర్లకు అధునాతన ఫీచర్లను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 1 నుంచి వాట్సాప్‌ పనిచేయని ఫోన్‌లలో సామ్‌సంగ్‌, ఎల్‌జీ, జడ్‌టీఈ, హువావే, సోనీ, ఆపిల్‌ కంపెనీకి చెందిన ఫోన్‌లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ నిలిచిపోనుంది..

సామ్‌సంగ్‌:

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్‌ లైట్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్‌ II, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌II, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌ 3 మిని, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎక్స్‌ కవర్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ కోర్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏస్‌2

యాపిల్‌ ఐఫోన్‌:

ఐఫోన్‌ ఎస్‌ఈ (ఫస్ట్‌ జనరేషన్‌), ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌. ఒకవేళ ఈ మొబైళ్లు ఐఓస్‌ 10కి అప్‌డేట్‌ కాకపోతే ఇవి వాట్సాప్ లేటెస్ట్‌ వెర్షన్‌ను సపోర్ట్‌ చేయవు.

ఎల్‌జీ:

ఎల్‌జీ లూసిడ్‌ 2, ఆప్టిమస్‌ ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎఫ్‌5, ఆప్టిమస్‌ ఎల్‌3II, ఆప్టిమస్‌ ఎల్‌5II, ఆప్టిమస్‌ ఎల్‌5 డ్యూయల్‌, ఆప్టిమస్‌ ఎల్‌7, ఆప్టిమస్‌ ఎల్‌7 II, ఆప్టిమస్‌ ఎఫ్‌6, ఎనాక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌ 4II డ్యూయల్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ నైట్రో హెచ్‌డీ, 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ.

Also Read: Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

Telegram Feature: సెట్ చేసుకున్న సమయానికి మెసేజ్.. టెలిగ్రామ్‌లో ఉన్న ఈ క్రేజీ ఫీచర్‌ మీకు తెలుసా?

TATA EV Cars:ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ దూకుడు..మరో ఎనిమిది మోడళ్లలో ఈవీలను తీసుకురానున్న కంపెనీ..