- Telugu News Photo Gallery Technology photos How To Download Instagram Reels Video Follow This Simple Trick
Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియట్లేదా.? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి.
Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన రీల్స్.. టిక్‌టాక్‌కు గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. మరి మనకు నచ్చిన రీల్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియటం లేదా.? ఇందుకోసం ఓ చిన్న ట్రిక్ ఉందని మీకు తెలుసా.?
Updated on: Sep 09, 2021 | 9:24 AM

యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ దూసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఓ ఫీచర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వచ్చే వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫీచర్ ఉండదు. మరి నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! ఇందుకోసం ఓ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.

ఇందుకోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీరు సేవ్ చేసుకోవాలనుకునే రీల్‌ను ప్లే చేయాలి.

రీల్ ప్లే అవుతున్న సమయంలో స్క్రీన్ కుడివైపు కింది భాగంలో లైక్, కామెంట్, షేర్ ఆప్షన్స్ కనిపిస్తాయి.

వీటిలో షేర్ ఐకాన్‌పై క్లిక్ చేయగానే.. చిన్న పాపప్ విండో ఓపెన్ అయ్యి, మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. అక్కడ మొదట కనిపించే ‘Add Reel to Your Story’పై క్లిక్ చేయాలి. దీంతో మీ స్టోరీ విండో ఓపెన్ అవుతుంది.

ఆ విండోలో పైన డౌన్‌లోడ్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ రీల్ మీ ఫోన్‌లో సేవ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన రీల్ ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్ ఫోల్డర్‌లో సేవ్ అవుతుంది.





























