Maruti Suzuki EV: మారుతి నుంచి ఎట్టకేలకు విడుదలైన ఎలక్ట్రిక్‌ కారు.. ధర ఎంతంటే..

Maruti Suzuki EV: మారుతి సుజుకి ఇ విటారా మూడు వేరియంట్లలో, 10 కలర్స్‌ ఆప్షన్‌లతో అందించనుంది. స్పెసిఫికేషన్ల పరంగా, SUV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీలు 48.8kWh, 61.6kWh. ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ వరకు..

Maruti Suzuki EV: మారుతి నుంచి ఎట్టకేలకు విడుదలైన ఎలక్ట్రిక్‌ కారు.. ధర ఎంతంటే..

Updated on: Dec 02, 2025 | 6:38 PM

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఎట్టకేలకు e Vitara లాంచ్తో EV రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ బ్రాండ్ మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే ఏడాది డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కార్లను గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది కంపెనీ. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతులు జరుగుతున్నాయి.

మారుతి సుజుకి ఇ విటారా మూడు వేరియంట్లలో, 10 కలర్స్ఆప్షన్లతో అందించనుంది. స్పెసిఫికేషన్ల పరంగా, SUV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీలు 48.8kWh, 61.6kWh. ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ వరకు రేంజ్ను అందిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే, టెక్నాలజీ పరంగా e Vitara మారుతి ఫ్లాగ్‌షిప్ మోడల్ అవుతుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవల్ 2 ADAS సూట్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, TPMS, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి E విటారా ధర (అంచనా)

కార్దేఖో వెబ్సైట్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందట. ఈ ధరల శ్రేణిలో లాంచ్ అయితే ఇది Tata Curvv EV, Hyundai Creta EV, MG Windsor EV, Mahindra BE 6 వంటి వాహనాలతో పోటీ పడగలదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి