Chat Gpt Diet Plan: మూడు నెలల్లో ఏకంగా 11 కిలోలు బరువు హుష్‌కాకి.. చాట్‌జీపీటీ సలహాతో వేగంగా బరువు తగ్గుదల

ఏఐ సాఫ్ట్‌వేర్ జీవితంలోని అన్ని రంగాల్లో ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు ఆచరణాత్మక సలహా కోసం ప్రస్తుతం ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రోజువారీ జీవితంలో సూచనల కోసం కొంత మంది ఏఐ సాయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఓ వ్యక్తి డైట్‌ ప్లాన్‌ కోసం ఏఐ చెప్పిన చిట్కాలను పాటించి మూడు నెలల్లో ఏకంగా 11 కిలోల బరువు తగ్గాడు.

Chat Gpt Diet Plan: మూడు నెలల్లో ఏకంగా 11 కిలోలు బరువు హుష్‌కాకి.. చాట్‌జీపీటీ సలహాతో వేగంగా బరువు తగ్గుదల
Ai Chatbot 1

Updated on: Jul 15, 2023 | 9:00 PM

ప్రస్తుతం ప్రపంచం అంతా చాట్‌ జీపీటీ ట్రెండ్‌ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), శక్తి, సంభావ్యత మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఏఐ సాఫ్ట్‌వేర్ జీవితంలోని అన్ని రంగాల్లో ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు ఆచరణాత్మక సలహా కోసం ప్రస్తుతం ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రోజువారీ జీవితంలో సూచనల కోసం కొంత మంది ఏఐ సాయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఓ వ్యక్తి డైట్‌ ప్లాన్‌ కోసం ఏఐ చెప్పిన చిట్కాలను పాటించి మూడు నెలల్లో ఏకంగా 11 కిలోల బరువు తగ్గాడు. ఇటీవల గ్రెగ్ ముషెన్ అనే వ్యక్తి తన కోసం ఫిట్‌నెస్, డైట్ ప్లాన్‌ను రూపొందించుకోవడానికి ఏఐను ఉపయోగించినట్లు వెల్లడించాడు. ప్రణాళిక క్రమంగా వేగవంతమైన ఫలితాలను అందించిందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బరువు తగ్గడానికి ఏఐ ఎలాంటి సలహాలను ఇచ్చిందో? ఓ సారి తెలుసుకుందాం.

అయితే ఏఐ ఎలాంటి సలహాలను ఇచ్చినా వాటిని గుడ్డిగా అనుసరించకూడదని నిపుణులు చెబుతుననారు. బరువు తగ్గడం అనేది వ్యక్తికు సంబంధించిన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఏఐ సాఫ్ట్‌వేర్ అందించిన ఫిట్‌నెస్ సలహా బరువు తగ్గాలనుకునే వారికి ఓ మార్గంగా మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా గ్రెగ్ ముషెన్ ఫిట్‌గా ఉండటానికి డైలీ వాకింగ్‌ చేయకుండానే బరువు తగ్గాడు. అతను రన్నింగ్ ప్లాన్‌ను రూపొందించడంలో తనకు సహాయం చేయమని చాట్‌జీపీటీను కోరాడు. అయితే మొదట చాట్‌బాట్ తన నడుస్తున్న షూలను ముందు తలుపు దగ్గర ఉంచమని చెప్పింది. అయితే ఎల్లప్పుడు షూస్‌ చూసిన గ్రెగ్‌ నెమ్మదిగా, స్థిరంగా అలసిపోకుండా రెండు నిమిషాలు పరుగెత్తడం ప్రారంభించాడు. క్రమేపి స్థిరత్వం ద్వారా అలవాటును పెంచుకోగలిగాడు. ఎఫెక్టివ్ వర్కవుట్ రొటీన్‌తో పాటు, పోషకాహారానికి సంబంధించి ‘విలువైన అంతర్దృష్టి’తో కూడా ఏఐ బోట్ సహాయపడింది. ఇది అతని బరువు తగ్గించే ప్రయాణానికి అనుబంధంగా ఉండే సమతుల్య భోజనం,నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలపై సలహాలను అందించింది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ నయా డైట్‌ ఆప్షన్‌ను కూడా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..