Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Chat GPT: వాట్సాప్‌లో చాట్‌జీపీటీ సేవలు.. ఈ యాప్స్‌తో సాధ్యమే

తాజాగా ఇటలీ కూడా తమ దేశంలో చాట్ జీపీటీ వాడకాన్ని నిషేధించింది. అయితే ఈ ఆందోళనలు ఎలా ఉన్నా చాట్ జీపీటీ అంటే ఎలా ఉంటుంది? అనే ఉత్సుకతతో చాలా మంది యువత తమ మొబైల్లో చాట్ జీపీటీని పొందడం ఎలా? అని అన్వేషిస్తున్నారు.

Whatsapp Chat GPT: వాట్సాప్‌లో చాట్‌జీపీటీ సేవలు.. ఈ యాప్స్‌తో సాధ్యమే
Chat GPT Whatsapp
Follow us
Srinu

|

Updated on: Apr 08, 2023 | 6:45 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ మేనియా నడుస్తుంది. ముఖ్యంగా టెక్ మార్కెట్‌ను చాట్ జీపీటీ శాసిస్తుంది. చాట్ జీపీటీ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారనే అనే భయాలు ఇప్పటికే చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ ఆరోపణలు తగినట్లుగా వివిధ దేశాలు చాట్ జీపీటీ వినయోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇటలీ కూడా తమ దేశంలో చాట్ జీపీటీ వాడకాన్ని నిషేధించింది. అయితే ఈ ఆందోళనలు ఎలా ఉన్నా చాట్ జీపీటీ అంటే ఎలా ఉంటుంది? అనే ఉత్సుకతతో చాలా మంది యువత తమ మొబైల్లో చాట్ జీపీటీని పొందడం ఎలా? అని అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా యువత తమ మొబైల్స్‌లో వాడే వాట్సాప్‌కు చాట్ జీపీటీ సేవలను అనుసంధానం చేయాలని కోరుకుంటున్నారు. మనం పేర్కొనే కొత్త జీపీటీలు సింపుల్ గూగుల్ సెర్చ్‌లో కనుగొని మన మొబైల్లో వాటి సేవలను ఆనందించవచ్చు. కాబట్టి మొబైల్లో వాడే చాట్ జీపీటీ యాప్స్‌ను ఓ సారి తెలుసుకుందాం.

బడ్డీ జీపీటీ

సిరి, గూగుల్ అసిస్టెంట్‌కి వీడ్కోలు చెబుతూ కొత్త వ్యక్తిగత ఏఐగా బడ్డీ జీపీటీ అందుబాటులో వచ్చింది. వాట్సాప్‌లో బడ్డీ జీపీటీ ద్వారా ప్రశ్నలకు సమాధానమివ్వడం, మీరు నేర్చుకోవడంలో సహాయం చేయడానికి వాయిస్ కమాండ్‌లకు కూడా ప్రతిస్పందించడం వంటివి సులభంగా ఉంటాయి. 

రోజర్ డా విన్సీ

వాట్సాప్, టెలిగ్రామ్‌లో సూపర్-స్మార్ట్ ఏఐగా, మీ గో-టు కంటెంట్ జనరేటర్‌తో పాటు సహజంగా మాట్లాడే రోజర్‌ను కోసం ఈ ఏఐ బాగా పని చేస్తుంది. ఎల్లప్పుడూ చాట్ చేయడానికి, అలాగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా రోజర్ డా విన్సీ ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

విజ్ ఏఐ

విజ్ ఏఐతో వాట్సాప్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారుతుంది. కేవలం టెక్స్ట్‌ని పంపడం ద్వారా చాట్ జీపీటీ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం, సమాచారాన్ని పొందండి లేదా చాట్ చేయడానికి విజ్ ఏఐ చాలా బాగా పని చేస్తుంది. 

జిన్ని ఏఐ 

ఎడ్యుకేషనల్, వర్క్ సెట్టింగ్‌లకు సరైన హైపర్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ జిన్ని ఏఐగా పని చేస్తుంది. ముఖ్యంగా లాంచ్ వాట్సాప్‌ బటన్‌ను నొక్కితే చాలు జిన్ని ఏఐ వాట్సాప్ప్‌లో అందుబాటులో ఉంటుంది.

ష్మూజ్ ఏఐ

ష్మూజ్‌తో వాట్సాప్‌లో ఏఐ సేవలను పొందవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత ఏఐ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే చిత్రాలను సృష్టించవచ్చు. సులభంగా కమ్యూనికేట్ చేయడానికి ష్మూజ్ ఏఐ ఉపయోగపడుతుంది. 

మొబైల్ జీపీటీ

ఇప్పుడు జీపీటీ-4 ఇంజిన్‌తో ఆధారితమైన మొబైల్ జీపీటీ వాట్సాప్ అనుభవాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మెరుగైన ఏఐతో రూపొందించిన సంభాషణలు, చిత్రాలు, పత్రాలు అధునాతాన భాషా అనువాదాన్ని కూడా పొందవచ్చు. 

వాట్ జీపీటీ

వాట్ జీపీటీ చాట్ బాట్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది అలాగే వాయిస్ నోట్స్ లిప్యంతరిస్తుంది. అలాగే యూట్యూబ్ వీడియోలను సంగ్రహిస్తుంది. ఏఐతో చిత్రాలను కూడా సృష్టిస్తుంది. మీ వాట్సాప్‌లో ఈ చాట్ జీపీటీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..