AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70 గంటలు నాన్‌స్టాప్ మ్యూజిక్​ కావాలంటే ఈ హెడ్‌ఫోన్స్ కొనాల్సిందే.. మరో స్పెషాలిటీ ఏంటంటే

JLab JBuds LUX ANC Headphones.. హెడ్‌ఫోన్స్ ఇప్పుడు పాటలు వినేందుకు మాత్రమే కాకుండా పని, ప్రయాణాలు, ఆన్‌లైన్ సమావేశాలకు కూడా అవసరంగా మారాయి. ఎక్కువసేపు ఉపయోగించే వారికి సౌకర్యవంతమైన రూపంతో పాటు ఎక్కువ బ్యాటరీ, బయట శబ్దాలను తగ్గించే సదుపాయం కావాలి. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఈ హెడ్‌సెట్ రూ.5,999 ధరలో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది.

70 గంటలు నాన్‌స్టాప్ మ్యూజిక్​ కావాలంటే ఈ హెడ్‌ఫోన్స్ కొనాల్సిందే.. మరో స్పెషాలిటీ ఏంటంటే
Jlab Jbuds Lux Anc Headphones
Nikhil
|

Updated on: Sep 17, 2026 | 9:20 PM

Share

లాంగ్ జర్నీలో పాటలు వింటున్నా, కార్యాలయంలో పని చేస్తున్నా హెడ్‌ఫోన్స్ పదేపదే ఛార్జ్ చేయాల్సి వస్తే చిరాకే. దీనికి తోడు చుట్టూ ఉండే శబ్దాలు సంగీతాన్ని ఆస్వాదించనివ్వవు. అలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ మోడల్‌లో Active Noise Cancellationతో పాటు 70 గంటల వరకు పనిచేసే బ్యాటరీని అందించారు.

గ్రాఫైట్ లుక్..

JLab నుంచి వచ్చిన ఈ ఆన్-ది-ఇయర్ హెడ్‌సెట్ గ్రాఫైట్ రంగులో క్లాసీగా కనిపిస్తుంది. ఆధునిక రూపంతో పాటు ఎక్కువసేపు ఉపయోగించేందుకు అనువుగా సాఫ్ట్‌గా చెవులపై అమరేలా రూపొందించారు. గంటల తరబడి ధరించినా చెవులపై ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణాల్లో తీసుకెళ్లడం కూడా సులభమే. హెడ్‌సెట్‌ను మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. దీంతో ఆఫీస్‌కు వెళ్లేవారు, తరచూ ప్రయాణాలు చేసేవారు సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు.

70 గంటల బ్యాటరీ

ఈ హెడ్‌సెట్‌లో Active Noise Cancellation ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ట్రాఫిక్, జనాల గోల వంటి పరిసర శబ్దాలను తగ్గించడంతో పాటలు, ఆడియో లేదా ఆన్‌లైన్ సమావేశాల్లో మాట్లాడే మాటలు మరింత స్పష్టంగా వినిపించేలా ఇది సహాయపడుతుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ANC ఆన్ లేదా ఆఫ్ చేసి ఉపయోగించే విధానాన్ని బట్టి గరిష్ఠంగా 70 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మళ్లీ ఛార్జర్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. తరచూ ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

మరో ముఖ్యమైన సదుపాయం Multi-Connectivity. ఒకేసారి రెండు పరికరాలకు హెడ్‌సెట్‌ను అనుసంధానించుకోవచ్చు. ఉదాహరణకు ల్యాప్‌టాప్‌లో పని చేస్తుండగా ఫోన్‌కు కాల్ వస్తే, పరికరాలను పదేపదే మార్చాల్సిన అవసరం లేకుండా కాల్‌ను సులభంగా నిర్వహించవచ్చు. రూ.5,999 ధరలో సౌకర్యవంతమైన రూపం, ANC, భారీ బ్యాటరీ, రెండు పరికరాల అనుసంధానం కోరుకునే వారికి ఈ హెడ్‌సెట్ మంచి ఎంపికగా నిలుస్తుంది.

Follow Us