ప్రీమియం వాచ్ లుక్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో బడ్జెట్‌లో అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. స్పెషాలిటీస్ ఇవే
GOBOULT Saber Smartwatch.. స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు సమయం చూసేందుకు మాత్రమే ఉపయోగపడటం లేదు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ వివరాలను తెలుసుకోవడంతో పాటు రోజువారీ పనుల్లోనూ ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే తక్కువ ధరలో ప్రీమియం రూపం, మంచి తెర, కాలింగ్ వంటి సదుపాయాలు అందించే వాచ్‌లకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో వచ్చిన కొత్త మోడల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

వాచ్ కొనేటప్పుడు అందమైన రూపంతో పాటు ఉపయోగకరమైన సదుపాయాలు ఉండాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో AMOLED తెర, కాలింగ్, ఆరోగ్య పర్యవేక్షణ, ఎక్కువ రోజుల బ్యాటరీ లభిస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఈ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అవేంటంటే..
ప్రీమియం డిజైన్..
చూడటానికి ఖరీదైన వాచ్‌ను తలపించేలా దీని రూపాన్ని రూపొందించారు. ఇందులో 1.43 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఉంది. 466×466 పిక్సెల్ రెజల్యూషన్, 700 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలోనూ తెరపై సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. Always-on Display సదుపాయం కూడా ఉంది.
ఈ వాచ్‌లో Functional Rotating Bezel ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని సాయంతో మెనూలను సులభంగా మార్చుకోవచ్చు. జింక్ అలాయ్ ఫ్రేమ్ కారణంగా నిర్మాణం దృఢంగా ఉంటుంది. 200కు పైగా Cloud, Custom Watch Faces అందుబాటులో ఉండటంతో నచ్చిన రూపాన్ని ఎంచుకోవచ్చు.
ఆరోగ్యం నుంచి కాలింగ్ వరకు
ఫోన్ చేతిలో లేకపోయినా మణికట్టు నుంచే కాల్స్ మాట్లాడేందుకు Bluetooth Calling సదుపాయం ఉంది. Bluetooth v5.3 కనెక్టివిటీ, బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి. AI Voice Assistant సపోర్ట్ కూడా అందించారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో Heart Rate, Blood Oxygen, Blood Pressure, Stress Levels వంటి వివరాలను గమనించవచ్చు. Sleep Monitor, Water Drink Reminder, Meditation Mode వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. వ్యాయామం చేసే వారికి 120కి పైగా Sports Modes అందించడం మరో ప్రత్యేకత.
బ్యాటరీ విషయానికి వస్తే సాధారణ వినియోగంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 7 రోజుల వరకు పనిచేస్తుంది. Fast Charging సదుపాయం ఉండటంతో త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. IP67 Water Resistance రేటింగ్ ఉండటంతో వర్షం, వ్యాయామ సమయంలో చెమట వంటి వాటిని తట్టుకునేలా రూపొందించారు. రూ.3,000 లోపు ధరలో AMOLED తెర, తిరిగే బెజెల్, కాలింగ్, ఆరోగ్య పర్యవేక్షణ వంటి సదుపాయాలు కోరుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తుంది.
