AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు కొత్త ఎస్‌యూవీలతో మతిపోగొట్టడానికి వచ్చేస్తున్న హోండా! ఒకటి ఈవీ, మరొకటి

Honda’s 2 New SUVs for India.. భారత్‌లో SUVలకు పెరుగుతున్న ఆదరణతో ప్రతి కార్ల సంస్థ ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటికే మిడ్-సైజ్ SUV విభాగంలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హోండా కూడా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. త్వరలో రెండు కొత్త SUVలను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో ఒకటి ప్రస్తుత మోడల్‌కు నవీకరణ కాగా, మరొకటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం.

రెండు కొత్త ఎస్‌యూవీలతో మతిపోగొట్టడానికి వచ్చేస్తున్న హోండా! ఒకటి ఈవీ, మరొకటి
Honda 2 New Suvs
Nikhil
|

Updated on: Sep 17, 2026 | 8:30 PM

Share

కొత్త కార్ల కోసం ఎదురుచూస్తున్న హోండా అభిమానులకు రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా ఎలివేట్‌కు కొత్త రూపం, అదనపు సదుపాయాలు రానుండగా.. ఆ తర్వాత సంస్థ తొలి ఎలక్ట్రిక్ SUVగా 0 ఆల్ఫా అడుగుపెట్టనుంది. ఈ రెండు వాహనాలతో భారత SUV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని హోండా చూస్తోంది.

ఎలివేట్‌కు కొత్త రూపం..

2023లో భారత మార్కెట్లో పరిచయమైన ఎలివేట్‌కు దాదాపు మూడేళ్ల తర్వాత ఫేస్‌లిఫ్ట్ అందించేందుకు హోండా సిద్ధమవుతోంది. ఈ కొత్త వెర్షన్‌ను భారత్‌తో పాటు జపాన్‌లో పరీక్షిస్తున్నట్లు సమాచారం. సాధారణ రూపాంతర మార్పులతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే కొత్త సదుపాయాలు ఇందులో చేరే అవకాశం ఉంది. రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త హెడ్‌ల్యాంప్ గ్రాఫిక్స్, మారిన రేడియేటర్ గ్రిల్, మెరుగైన లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ వంటివి కనిపించొచ్చు. 17-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. లోపల పెద్ద మార్పులు చేయకుండా సీట్ల అప్‌హోల్స్టరీ, ట్రిమ్‌లలో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, ముందు సీట్లకు వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, USB Type-C పోర్టులు వంటి సదుపాయాలు జోడించే అవకాశం ఉంది. ఇంజిన్‌లో మాత్రం మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 119hp పవర్, 145Nm టార్క్ అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగుతాయి.

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV..

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ తర్వాత సంస్థ మరో పెద్ద అడుగు వేయనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో 0 ఆల్ఫా పేరుతో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUVని భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. హోండా 0 SUV కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేకమైన డిజైన్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎలక్ట్రిక్ SUV మారుతి e Vitara, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400 వంటి వాహనాలకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అయితే దీని ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఇతర సాంకేతిక వివరాలను హోండా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Follow Us