Jio TvOS: టీవీ రిమోట్‌తో హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇలా చేస్తే చాలు..
టీవీ రిమోట్ మీ హార్ట్ బీట్ చెప్పడం మీరు ఎక్కడైనా చూసి ఉంటారా? రిమోట్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కలు కట్టి టీవీ తెరపై చూపిస్తుందని మీకు తెలుసా? అయితే మీకు జియో "TV-OS" రిమోట్ గూర్చి తెలియాలి.
టీవీ రిమోట్‌తో ఏం చేయగలుగుతారు. చానల్స్ మార్చగలుగుతాము… ఇంకా కావాలంటే యూట్యూబ్, ఓటీటీ యాప్స్ ఓపెన్ చేయగలుగుతారు… ఇంకా అడ్వాన్స్‌డ్ అయితే ఇంటర్నెట్ కూడా బ్రౌజ్ చేయొచ్చు. కానీ ఈ రిమోట్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఈ టీవీ రిమోట్ మీ హార్ట్ బీట్ ఎంతుందో కూడా చెప్పేస్తుంది. మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కలు కట్టి టీవీ తెరపై చూపిస్తుంది. ఇదొక్కటే కాదు ఈ రిమోట్ తో ఇంకా చాలా చాలా చేయొచ్చు.
జియో “TV-OS” పేరుతో కాస్టింగ్ డివైస్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది సెట్ అప్ బాక్స్ గా కూడా పనిచేస్తుంది. కొద్దిరోజుల క్రితమే జియో సెటప్ బాక్స్ లేకుండా యాప్ ద్వారా ఛానల్ చూసే అవకాశాన్ని కల్పించింది. అంతలోనే మళ్లీ సరికొత్త టెక్నాలజీతో సెటప్ బాక్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ జియో డివైస్‌తో మెయిన్ డోర్ కెమెరా కూడా కనెక్ట్ చేయొచ్చు. మీరు టీవీ చూస్తున్నప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే… డోర్ అవతలి వైపు ఉన్న వ్యక్తి టీవీ తెరపై ఉన్న విండోలో కనిపిస్తారు. అంతేకాదు కాలింగ్ బెల్ నొక్కిన వ్యక్తితో మీరు టీవీ నుంచే మాట్లాడొచ్చు. అవసరమైతే ఓపెన్ ద డోర్ అని మాట చెప్తే మెయిన్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది.
ఇక రిమోట్ చేతిలో పట్టుకొని సినిమాలు చూస్తున్నప్పుడు మీ బీపీ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అన్నది టీవీ స్క్రీన్ పై అప్పటికప్పుడే కనిపిస్తుంది. ఇక ఇదే రిమోట్‌తో గేమ్స్ జాయ్ స్టిక్ లేకుండా ఆడుకోవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి లైవ్ spo2 చెక్ చేసుకోవచ్చు. బీపీ మానిటరింగ్ చేసి నెల రోజుల వరకు ఇదే డివైస్‌లో సేవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇది గూగుల్ ఓఎస్, వెబ్ ఓఎస్ తరహాలో జియో ప్రత్యేకంగా రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మీరు చూస్తున్న కంటెంట్‌కు సంబంధించిన, ఆ రకమైన వీడియోలను సినిమాలను ఎప్పటికప్పుడు మీకు ప్రత్యేకమైన లిస్ట్ రూపంలో అందజేస్తుంది. ఇందులో తెలుగుతోపాటు ఇంకా దాదాపు అన్ని భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ ఇవ్వగలిగే అవకాశం ఉంది. ఇండియన్ టెలివిజన్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు జియో సిద్ధమైంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి