
భారతదేశంలో ఇటీవల కాలంలో ఓటీటీ యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఈ వినియోగం తారాస్థాయికి చేరింది. అయితే క్రమేపి ఓటీటీ యాప్స్ ధరలు పెరగడం సగటు ఓటీటీ లవర్స్‌కు ఆందోళనకు గురి చేస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో దాని యాడ్ ఫ్రీ సభ్యత్వాల ధరలను పెంచింది. ఫలితంగా వినియోగదారులు తమకు ఇష్టమైన ఓటీటీ కంటెంట్‌ని చూడడానికి ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి రిలయన్స్ జియో ఓ పరిష్కారంతో మన ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అనేక ప్రసిద్ధ ఓటీటీ యాప్‌లకు ఉచిత సభ్యత్వాలను కలిగి ఉన్న ఎంపిక చేసిన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో ఓటీటీ రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జియో రూ. 398 ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 56 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు జియో టీవీ యాప్ ద్వారా సోనీ లివ్, జీ 5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కాంచలంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డ్యాకూ బే, ఎపిక్ ఆన్, ఫ్యాన్ కోడ్, హోయ్‌చోయ్ వంటి విభిన్న స్ట్రీమింగ్ సేవలకు కూడా యాక్సెస్ పొందవచ్చు. అదనంగా ఇది మై జియో ఖాతాకు క్రెడిట్ చేసేలా జియో సినిమా ప్రీమియంకు 28 రోజుల సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 168 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 168 జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే మీరు సోనీ లివ్, జీ-5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యూబే, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కంచలంకా, ఎపిక్ ఆన్, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఉచిత ప్రాప్యతను పొందవచ్చు.
ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 168 జీబీ హై-స్పీడ్ డేటా (రోజుకు 2 జీబీ)తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలకు యాక్సెస్ కూడా పొందవచ్చు. అదనంగా అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి