AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పెద్దవాళ్ల కోసం ఫోన్‌ కొనాలంటే ఇది చాలా బెటర్‌. ధర తక్కువ, సేఫ్టీ కూడా

వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్ ఫోన్‌ను itel భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. itel Care పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో పెద్ద బటన్లు, మాగ్నిఫైడ్ డిస్‌ప్లే, వాయిస్ గైడెన్స్, అత్యవసర SOS వంటి సదుపాయాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అవసరం లేని వృద్ధులు సులభంగా కాల్స్ చేసుకోవడం, మెసేజ్‌లు చదవడం, అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించడం లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించారు.

ఇంట్లో పెద్దవాళ్ల కోసం ఫోన్‌ కొనాలంటే ఇది చాలా బెటర్‌. ధర తక్కువ, సేఫ్టీ కూడా
Itel Care Feature Phone
Nikhil
|

Updated on: Oct 08, 2026 | 7:42 AM

Share

చూపు, వినికిడి సమస్యలను దృష్టిలో పెట్టుకుని itel Careలో అనేక సౌకర్యాలు అందించారు. 2 అంగుళాల మాగ్నిఫైడ్ డిస్‌ప్లే, పెద్ద బటన్లు, పెద్ద ఐకాన్లతో కూడిన ఇంటర్‌ఫేస్ ఉన్నాయి. 10 ప్రాంతీయ భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్, 22 భాషల్లో రీడింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీంతో వృద్ధులు తమకు అనుకూలమైన భాషలో ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

రెండు సెకన్లలో SOS అలర్ట్

ఫోన్ వెనుక ఎరుపు రంగులో ప్రత్యేక SOS బటన్ ఉంటుంది. దీన్ని రెండు సెకన్లు నొక్కితే ముందుగా సేవ్ చేసిన ఐదు కాంటాక్ట్లకు SMS అలర్ట్ వెళ్తుంది. అనంతరం ప్రైమరీ కాంటాక్ట్‌కు ప్రాధాన్యతనిస్తూ వరుసగా వాయిస్ కాల్స్ వెళ్లేలా ఫోన్ పనిచేస్తుంది. King Voice ఫీచర్ మెనూ, మెసేజ్‌లు, ఇన్‌కమింగ్ కాల్స్ వివరాలను ఇంగ్లిష్, హిందీలో చదివి వినిపిస్తుంది. 500 కాంటాక్ట్లను ఫొటోలతో సేవ్ చేసుకోవచ్చు.

1,150mAh బ్యాటరీ..

వినికిడి సౌకర్యం కోసం 2030 బాక్స్ స్పీకర్, ప్రత్యేక ఆడియో పవర్ యాంప్లిఫైయర్ ఇచ్చారు. కాల్స్‌లో చుట్టుపక్కల శబ్దాలను తగ్గించేందుకు AI ENC సపోర్ట్ ఉంది. 1,150mAh బ్యాటరీని USB Type-C ద్వారా ఛార్జ్ చేయవచ్చు. డ్యూయల్ LED టార్చ్, VGA కెమెరా, వైర్‌లెస్ FM రేడియో, రికార్డింగ్, Bluetooth, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. microSD కార్డ్‌తో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. Black, Dark Green, Blue రంగుల్లో లభించే itel Care ధర రూ.1,499. బాక్స్‌లో బ్యాక్ కవర్, ఒక సంవత్సరం కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీ ఇస్తున్నారు.

Follow Us