AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే..!

మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్‌వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది.

టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే..!
Isro Satillite
Ch Murali
| Edited By: |

Updated on: Sep 20, 2025 | 8:25 AM

Share

మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్‌వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది.

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుండి అక్టోబర్ నెల రెండవ వారంలో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో శాస్త్రవేత్తలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహంను ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ద్వారా ఈ సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.

ఎల్‌వీఎం-3ఎం మార్క్-5ను వచ్చేనెల రెండో వారంలో ఈ ప్రయోగం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. షార్ లో రాకెట్ అనుసంథానం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా 6,500 కిలోల బరువైన బ్లాక్-2 బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది.

ఈ నెలాఖరులోగా ఉప గ్రహం భారత్‌కు చేరుకోనుంది. ఈ ప్రయోగం ద్వారా స్మార్ట్ ఫోన్ కు ప్రత్యక్ష అనుసంధానం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధార పడకుండా నేరుగా కాల్స్ చేసుకోవడానికి.. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

సీఎంఎస్‌-02 ఉపగ్రహం ద్వారా భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు.. కొండల్లో, కొనల్లో, దట్టమైన అడవి ప్రాంతాల్లో కూడా సరికొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ సీఎంఎస్‌ ఉపగ్రహం దోహదపడుతుంది. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ఎన్నో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగికి పంపి ఘన విజయం సాధించారు. అయితే ఈ ప్రయోగం కమ్యూనికేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. సీఎంఎస్‌-02 ఉపగ్రహాన్ని అక్టోబర్ 15వ తారీకు నుండి 19వ తారీఖు లోపల ఈ LVM-03-M5 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఈ రాకెట్ అనుసంధాన పనులను షార్ లోని వెహికిల్ అసెంబ్లింగ్ భవనంలో ముమ్మరంగా చేశారు.

ఈ రాకెట్ ప్రయోగం గనుక విజయవంతం అయితే భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ప్రయోగాన్ని అక్టోబర్ మాసంలో ఏ రోజున ప్రయోగించే తేదీని ఇస్రో శాస్త్రవేత్తలు ఖరారు చేయాల్సి ఉంది..!

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..