Aditya L1: చంద్రయాన్ 3 ప్రయోగం తర్వాత భారత్ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక మిషన్ ‘ఆదిత్యం ఎల్1’. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ చేస్తోన్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం. ఇక దీనికి నిన్న అంటే శుక్రవారం కౌంట్ డౌన్ స్టార్ అవగా, ఈ రోజు ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది ఆదిత్య ఎల్-1 రాకెట్. ఇది సూర్యుడు-భూమి మధ్యలోని లాంగ్రాంజ్ పాయింట్-1 వైపు పయనించి, సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనుంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్1 ముందుగా భూమి నుంచి సూర్యుడి వైపు 125 రోజుల ప్రయాణం చేసి 15 లక్షల కి.మీల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ ఎల్1ని చేరుకుంటుంది. ఇక ఈ ప్రయోగం కోసం రూ.400 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా ఇస్రో తెలిపింది. అలాగే ఈ శాటిలైట్ లైఫ్ టైమ్ 5 ఏళ్లకు పైగానే ఉంటుందని సమాచారం.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches India's first solar mission, #AdityaL1 from Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh.
ఇవి కూడా చదవండిAditya L1 is carrying seven different payloads to have a detailed study of the Sun. pic.twitter.com/Eo5bzQi5SO
— ANI (@ANI) September 2, 2023
అసలు అదిత్య L1లో ఎలాంటి పరికరాలు ఉంటాయి..? అంటే Aditya L1 మొత్తం ఏడు పేలేడ్లు మోసుకెళ్తుంది. ఇందులో ప్రధానమైనది విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (VELC). అలాగే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య. ఇంకా..సోలార్ లో ఎనర్జీ స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాగ్రెటోమీటర్ పేలోడ్‌లను అమర్చారు.
Another milestone for @isro 🚀 !
India's maiden solar mission, Aditya-L1 successfully launched from Sriharikota #AdityaL1 #AdityaL1Launch@isro pic.twitter.com/QsFyq3OGtK
— DD News (@DDNewslive) September 2, 2023
ఆదిత్య ఎల్1కు టెలిస్కోప్‌కు సూర్యుడి మీద ఆయా ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించే వినూత్న పరిజ్ఞానాన్నీ జోడించారు. హఠాత్తుగా చెలరేగే సీఎంఈలు, సౌర జ్వాలలు, తుపాన్ల వంటి వాటిని పసిగట్టటానికిది తోడ్పడుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..