Fast Charging: ఫాస్ట్ చార్జింగ్ వల్ల ఫోన్ పాడవుతుందా? ఇది తెలుసుకోండి!

ఈ రోజుల్లో చాలా మొబైల్స్.. ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తున్నాయి. కంపెనీలు 100 వాట్, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్లను ప్రొవైడ్ చేస్తున్నాయి. వీటిని వాడి ఛార్జ్ చేయడం ద్వారా నిముషాల్లోనే ఫోన్ బ్యాటరీ ఫుల్ అవుతుంది. అయితే దీనివల్ల నిజంగా ఉపయోగం ఉందా? ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ త్వరగా పాడవుతుందా?

Fast Charging: ఫాస్ట్ చార్జింగ్ వల్ల ఫోన్ పాడవుతుందా? ఇది తెలుసుకోండి!
Fast Charging

Updated on: Oct 26, 2025 | 4:14 PM

సాధారణంగా ఫోన్ బ్యాటరీ ఫుల్ అయిన ప్రతిసారీ బ్యాటరీ లైఫ్ టైం కొంత తగ్గుతూ వస్తుంది. అయితే బ్యాటరీ చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడం ద్వారా బ్యాటరీ సామర్థ్యం మరింత వేగంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇబ్బందులు ఇవే..

ఫోన్​ను ఫాస్ట్ ఛార్జర్​తో ఛార్జ్ చేసినప్పుడు.. బ్యాటరీ లోపల ఉండే ఎలక్ట్రోలైట్ ద్రావణంలోని లవణాలు మరింత వేగంగా గడ్డకడతాయి.  ఈ ప్రక్రియ వల్ల బ్యాటరీ లైఫ్ టైం మెల్లగా తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒకేసారి ఎక్కువ వోల్టేజ్ పడడం వల్ల బ్యాటరీ లోపలి నుంచి డ్యామేజ్ అవుతుందట. అందుకే మరీ ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్లు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

హీటింగ్ ప్లాబ్లమ్

ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ కొంత వేడెక్కడం కామన్. అయితే ఫాస్ట్ ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ హీటింగ్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తద్వారా మొబైల్ పనితీరుపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఫోన్లలో హీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకపోతే ఫోన్‌తోపాటు బ్యాటరీ కూడా వేడెక్కుతుంది.

సేఫ్టీ ఇలా..

ఇకపోతే  ఫాస్ట్ ఛార్జింగ్ వాడేందుకు కొన్ని నియమాలున్నాయి. అవేంటంటే..  మొబైల్‌ను కంపెనీ ఇచ్చిన ఛార్జర్‌‌తోనే ఛార్జ్ చేయాలి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయని మొబైల్స్‌కు ఫాస్ట్ ఛార్జర్స్‌ను కనెక్ట్ చేయకూడదు. అలాగే లిమిట్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉండే చార్జర్స్‌ను కూడా కనెక్ట్ చేయకూడదు.  ఉదాహరణకు మీ మొబైల్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టయితే దానికి100 వాట్ ఫాస్ట్‌ ఛార్జర్‌‌తో ఛార్జింగ్ పెట్టకూడదు. ఏదేమైనా ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ జీవితం ఎంతో కొంత తగ్గుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలనుకుంటే మీరు సాధారణ ఛార్జింగ్‌ ఉపయోగించడం మంచిది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..